News July 14, 2024
గత 3-4ఏళ్లలో 8 కోట్ల జాబ్స్ క్రియేట్ అయ్యాయి: పీఎం మోదీ

భారత్‌లో గత 3-4ఏళ్లలో కొత్తగా 8 కోట్ల జాబ్స్ క్రియేట్ అయ్యాయని PM మోదీ తెలిపారు. ఈ విషయం RBI ఇటీవల రిలీజ్ చేసిన రిపోర్టులో వెల్లడైందన్నారు. నిరుద్యోగం పేరిట కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ రిపోర్టులో వారి నోళ్లన్నీ మూతపడ్డాయని వ్యాఖ్యానించారు. ముంబైలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. NDA ప్రభుత్వం మాత్రమే దేశంలో స్థిరమైన పాలనను అందించగలదని పేర్కొన్నారు.
Similar News
News January 31, 2026
సంగారెడ్డి: సూపర్వైజర్లు, బీఎల్వోలు క్షేత్రస్థాయిలో పనిచేయాలి: కలెక్టర్

ఓటర్ల జాబితా సవరణలో భాగంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సూపర్వైజర్లు, బీఎల్వోలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, పాండు, ఆర్డీవో రాజేంద్ర పాల్గొన్నారు.
News January 31, 2026
రూ.5వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లాగేశారు: జగన్

AP: విశాఖలో చంద్రబాబు, ఆయన కుటుంబం దాదాపు రూ.5వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లాగేసుకుందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. రుషికొండ సమీపంలోని 54.79 ఎకరాల భూములను ఎంపీ భరత్‌కు కట్టబెట్టేశారని ట్వీట్ చేశారు. లోకేశ్‌కు ఎలాంటి అధికార పరిధి లేకపోయినా తోడల్లుడికి కేటాయించేలా చేశారని తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు ఒత్తిళ్లతో GVMC సభ్యులను భయపెట్టి ఏకపక్షంగా ఆమోదించుకున్నారని పేర్కొన్నారు.
News January 31, 2026
ఈ అలవాట్లతో గుండె ఆరోగ్యానికి రిస్క్!

చిన్న పొరపాట్లు గుండె ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడతాయని వైద్యులు చెబుతున్నారు. తినే ఆహారం, నిద్రపోయే సమయం, డైలీ రొటీన్ పనులు హార్ట్ హెల్త్‌ను ప్రభావితం చేస్తాయి. రోజూ 6-8 గం. పాటు నాణ్యమైన నిద్ర లేకపోతే గుండె ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే. కుర్చీ, సోఫా, డ్రైవింగ్ సీట్‌లో పగటిపూట ఎక్కువ సమయం కూర్చొనే వారికి హార్ట్ రిలేటెడ్ సమస్యలు వచ్చే ఛాన్సుంది. ఒత్తిడి, టెన్షన్ శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.


