News January 8, 2025
తిరుమల శ్రీవారి దర్శనానికి 8గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేనివారికి వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 8గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 62,566 మంది దర్శించుకోగా, 16,021 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.2కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. అటు, తిరుమల నుంచి మహాకుంభమేళా జరుగుతున్న యూపీలోని ప్రయాగ్రాజ్కు శ్రీవారి రథం బయల్దేరింది.
Similar News
News January 30, 2026
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News January 30, 2026
T20 WC నుంచి బంగ్లా తప్పుకోవడం కరెక్ట్ కాదు: సురేశ్ రైనా

భద్రతా కారణాల దృష్ట్యా T20 WC నుంచి తప్పుకుంటూ BCB తీసుకున్న నిర్ణయాన్ని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తప్పుబట్టారు. ‘టోర్నీలో పాల్గొనడానికి బంగ్లా ఇండియాకు వస్తే బాగుండేది. ప్రస్తుతం ఆ జట్టు బలంగా ఉంది. ఇక్కడి పరిస్థితుల్లో ఎలా రాణించాలో స్పిన్నర్లకు తెలుసు. భారత్కు రాకూడదనే నిర్ణయంతో ఆర్థికంగా నష్టపోతారు. సాంస్కృతిక ఆహ్వానాన్ని బంగ్లా ప్లేయర్లు మిస్ అవుతారు’’ అని రైనా పేర్కొన్నారు.
News January 30, 2026
తులసి మొక్కలోని మార్పులు దేనికి సంకేతం?

తులసిని ఆ ఇంట్లోని స్థితిగతులకు సూచికగా కూడా నమ్ముతారు. నీళ్లు పోయకున్నా అది విపరీతంగా పెరిగితే అనర్థానికి సంకేతమట. పచ్చని మొక్క అకస్మాత్తుగా ఎండిపోతే ఇంటి యజమాని ఆరోగ్యానికి/సంపదకు కీడు జరుగుతుందట. ఆకుల రంగు మారడాన్ని ప్రతికూల శక్తుల ప్రభావంగా పరిగణిస్తారు. అయితే తులసి మొక్కను నిత్యం భక్తితో పూజిస్తూ, సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఆటంకాలు తొలగి, ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని నమ్మకం.


