News September 13, 2024
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

AP: తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇటు టైమ్ స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 63,544 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,942 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి రూ.3.37 కోట్ల ఆదాయం లభించింది.
Similar News
News December 11, 2025
సర్పంచ్ ఎన్నికలు.. 9 ఓట్లతో గెలిచాడు

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఫలితాలు వెలువడుతున్నాయి. స్వల్ప ఓట్ల తేడాతో కొందరు అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చీన్యా తండాలో బీఆర్ఎస్ బలపరిచిన జాటోత్ హరిచంద్ 9 ఓట్లతో గెలిచారు. అటు జగిత్యాల జిల్లా తిమ్మాపూర్ తండాలోనూ బీఆర్ఎస్ బలపరిచిన మెగావత్ లత 12 ఓట్లతో విజయం సాధించారు.
News December 11, 2025
ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులపై కమిటీ

AP: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులపై ప్రభుత్వం ఏడుగురితో కమిటీని ఏర్పాటుచేసింది. ఈమేరకు GO880 విడుదల చేసింది. CS నేతృత్వంలో GAD, ఫైనాన్స్, హెల్త్ సెక్రటరీలు, AP గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ల ప్రెసిడెంట్లు సభ్యులుగా, NTR వైద్యసేవా ట్రస్టు CEO కన్వీనర్గా ఉన్నారు. కాగా 8 వారాల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఈ కమిటీకి కాలపరిమితిని నిర్దేశించింది.
News December 11, 2025
పంచాయతీ ఎన్నికలు.. అత్యధిక పోలింగ్ ఎక్కడంటే?

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగియగా కౌంటింగ్ కొనసాగుతోంది. అయితే రాష్ట్రంలో అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 87.93 శాతం పోలింగ్ నమోదైంది. తర్వాతి స్థానాల్లో సూర్యాపేట(87.77%), మెదక్(86%), నల్గొండ(81.63%), వరంగల్(81.2%), నిర్మల్(79.81%), మంచిర్యాల(77.34%), హన్మకొండ(75.6%), ములుగు(73.57%), జనగాం(71.96%), ఆదిలాబాద్(69.10%) జిల్లాలున్నాయి.


