News April 9, 2024
ఈ ఎలక్ట్రిక్ బైక్‌కు 8లక్షల కిలోమీటర్ల వారంటీ!

బెంగళూరుకు చెందిన అల్ట్రావైలెట్ ఆటోమోటివ్ తమ ఈ-బైక్స్‌కు వారంటీ స్కీమ్ తేవడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. F77 మోడల్‌కు UV కేర్ మ్యాక్స్ ప్యాకేజీ కింద 8లక్షల KM/ 8ఏళ్ల వారంటీని ప్రకటించింది. UV కేర్ (60వేల KM), UV కేర్+ (లక్ష KM) ప్యాకేజీలూ ఉన్నాయి. గతంలోనూ ఈ స్కీమ్స్ ఉన్నా తాజాగా వాటి రేంజ్ పెంచింది. భారత్‌లో దొరికే బ్యాటరీల్లో నాణ్యత లోపించడంతో ఈ స్కీమ్ తెచ్చినట్లు సంస్థ తెలిపింది.
Similar News
News March 3, 2026
ఇరాన్‌పై గల్ఫ్ దేశాలు ఎందుకు దాడులు చేయట్లేదు?

ఖురాన్‌లో Muslim Ummah అనే విధానం ఉంది. అంటే ప్రపంచంలోని అందరూ ముస్లింలు ఒకే సమూహం/సమాజానికి చెందినవారు అని అర్థం. ఒక దేశానికి కష్టం వస్తే మరో దేశం సహకరించుకుంటాయి. ఒక ముస్లిం దేశంపై మరొక ముస్లిం దేశం దాడి చేయడం Ummah సిద్ధాంతానికి విరుద్ధమని చాలా మంది భావిస్తారు. ఇప్పుడు ఇరాన్‌పై గల్ఫ్ దేశాలు యుద్ధం ప్రారంభిస్తే ఇజ్రాయెల్‌కు సహకరిస్తున్నాయనే ముద్ర పడుతుంది. ఆర్థికంగానూ తీవ్రంగా నష్టపోతాయి.
News March 3, 2026
మహిళలకు సర్కారు శుభవార్త

TG: డ్వాక్రా మహిళల కోసం ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకురానుంది. ఇప్పటివరకు సభ్యులకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంది. బ్యాంకు నుంచి అప్పు తీసుకొని మెంబర్ చనిపోతే దాన్ని ఫ్యామిలీ చెల్లించాల్సి వస్తోంది. ఇక నుంచి మహిళల రుణానికీ బీమా స్కీమ్‌ను GOVT ప్రవేశపెట్టనుంది. దీంతో రుణం తీసుకున్నవారు మరణిస్తే ప్రభుత్వమే బ్యాంకుకు చెల్లిస్తుంది. ఆ సభ్యురాలికి ₹10L బీమా కూడా ఉంటుంది. ఈ బీమా సొమ్మునూ GOVT చెల్లిస్తుంది.
News March 3, 2026
కలెక్టర్లూ ఇదేం తీరు… CM సీరియస్

TG: అధికారుల పనితీరుపై CM రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని జిల్లాల్లో భూ వివాదాలకు కలెక్టర్లే కారణమని అసంతృప్తి వ్యక్తంచేశారు. జిల్లా కేంద్రంలో ఉండకుండా HYD నుంచి రాకపోకలు సాగిస్తున్నారన్నారు. సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని ముగ్గురు కలెక్టర్లపై మండిపడ్డారు. ఇప్పటికే కొంతమందిని బదిలీ చేశామని, ఇంకా మారకపోతే ఇబ్బందులు తప్పవని కలెక్టర్ల కాన్ఫరెన్సులో హెచ్చరించారు.


