News September 23, 2024
పిడుగుపడి ఒకే చోట 8 మంది మృతి.. అందులో ఆరుగురు విద్యార్థులు..

ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో పిడుగుపాటుకు 8 మంది మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుల్లో ఆరుగురు విద్యార్థులు కూడా ఉన్నారు. పరీక్ష రాసి వస్తున్న విద్యార్థులు భారీ వర్షం కారణంగా ఒక చెట్టు కింద తలదాచుకున్నారు. ఈ క్రమంలో చెట్టుపై పిడుగుపడటంతో విద్యార్థులు మృతి చెందినట్టు కలెక్టర్ సంజయ్ అగర్వాల్ ధ్రువీకరించారు.
Similar News
News December 24, 2025
ఆరావళి మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం

ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్‌పై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఎలాంటి మైనింగ్ జరగదని స్పష్టం చేసింది. ఆరావళి పర్వత శ్రేణులకు నష్టం కలిగేలా మైనింగ్ చేపట్టడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ‘SAVE ARAVALI’ అంటూ సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరిగింది. ఈక్రమంలోనే కేంద్రం వెనక్కి తగ్గింది.
News December 24, 2025
మెడికల్ కాలేజీలపై PPPతోనే ముందుకెళ్లాలి: CM

AP: మెడికల్ కాలేజీలపై PPP విధానంతోనే ముందుకెళ్లాలని CBN వైద్యశాఖ సమీక్షలో స్పష్టం చేశారు. ముందుకొచ్చే వారికి VGF, ఇతర ప్రోత్సాహకాలూ ఇవ్వాలన్నారు. ‘ప్రీబిడ్‌లో 6 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయి. భూ వినియోగం, డిజైన్లలో స్వేచ్ఛ, కన్సార్టియం సభ్యుల సంఖ్య పెంపును అవి అడగ్గా అంగీకరించాం. ఆదోని కాలేజీ నిర్మాణానికి ఓ సంస్థ ఓకే అంది’ అని అధికారులు తెలిపారు. ఇతర సంస్థలనూ సంప్రదించాలని CM సూచించారు.
News December 24, 2025
రైతు మృతికి CMదే బాధ్యత: KTR

TG: కొనుగోలు కేంద్రంలో రైతు గుండెపోటుతో మరణించడం బాధాకరమని KTR పేర్కొన్నారు. ‘గద్వాల జిల్లా కలుకుంట్ల మొక్కజొన్న కేంద్రంలో జరిగిన ఈ ఘటనకు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిదే. 4రోజులుగా పడిగాపులుగాస్తున్నా పంట కొనకుండా నిండు ప్రాణాన్ని కాంగ్రెస్ బలిగొంది. రెండేళ్లలో 750మందికి పైగా రైతులు మరణించినా సీఎంకు చీమ కుట్టినట్టు కూడా లేదు. జమ్మన్న కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి’ అని ట్వీట్ చేశారు.


