News July 6, 2024

8న రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు: సజ్జల

image

AP: దివంగత YSR 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి, సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పార్టీ మళ్లీ చైతన్యవంతమై ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు ఇది తొలి అడుగుగా ఉండాలని పేర్కొన్నారు.

Similar News

News March 13, 2026

SEBI హోల్ టైమ్ మెంబర్‌గా తెలుగు వ్యక్తి!

image

స్టాక్ మార్కెట్లను పర్యవేక్షించే సెక్యూరిటీస్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో తెలుగు వ్యక్తికి కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. SEBI హోల్ టైమ్ మెంబర్‌గా మాజీ IDAS అధికారి కేవీ రమణమూర్తిని నియమించినట్లు తెలుస్తోంది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. గతంలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రతినిధిగా SEBIలో పార్ట్‌టైమ్ మెంబర్‌గా పనిచేశారు. సెబీ నిర్ణయాల్లో ఈయన కీలక పాత్ర పోషించనున్నారు.

News March 13, 2026

ఇళ్లు లేనివారికి శుభవార్త

image

AP: రాష్ట్రంలో అర్హులందరికీ రెండేళ్లలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున అందజేయాలని స్పష్టం చేశారు. అందుబాటులో ప్రభుత్వ భూమి లేకపోతే ప్రైవేటు స్థలం కొనుగోలు చేసి ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలనీల్లో మంజూరైన ఇళ్లు వద్దనుకుంటే రద్దు చేసి, అక్కడే లేదా మరో చోట 3 సెంట్లు ఇవ్వాలని పేర్కొన్నారు.

News March 13, 2026

యుద్ధం.. రూ.23.44 లక్షల కోట్లు ఆవిరి

image

పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి BSE సెన్సెక్స్ 5,252 పాయింట్లు(6.46%) తగ్గినట్లు PTI వెల్లడించింది. ఇన్వెస్టర్ల సంపద ₹23.44L Cr క్షీణించిందని తెలిపింది. 30 BSE లిస్టెడ్ కంపెనీల విలువ ₹440L Crకు పడిపోయినట్లు పేర్కొంది. జియో పాలిటిక్స్ టెన్షన్స్, క్రూడాయిల్ ధరలు పెరగడం, LNG ఉత్పత్తి తగ్గడం, రూపాయి ధర పతనం దీనికి ప్రధాన కారణాలని చెప్పింది.