News October 5, 2025
జమ్మూ ఎయిమ్స్‌లో 80 ఉద్యోగాలు

జమ్మూలోని ఎయిమ్స్ 80 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 24లోగా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని ఈనెల 28లోగా పంపాలి. ఇంటర్వ్యూ / రాత పరీక్ష /ఆబ్జెక్టివ్ ప్రమాణాల ఆధారంగా స్క్రీనింగ్ చేయవచ్చు. పోస్టును బట్టి DNB, MD/MS/DM/M.Ch ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. వెబ్‌సైట్: https://www.aiimsjammu.edu.in/
Similar News
News October 5, 2025
మెదడు సమస్యలకు నిద్రలేమి ఓ కారణం: పరిశోధన

ప్రస్తుత జీవనశైలి, ఉద్యోగ సమయాల వల్ల చాలా మంది నిద్రకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కొందరైతే రోజుకు 4-5 గంటలే నిద్రపోతున్నారు. అయితే మెదడు వయసు వేగంగా పెరగడానికి నిద్రలేమితో సంబంధం ఉన్నట్లు యూకే బయోబ్యాంక్ అధ్యయనంలో తేలింది. 27,500 మందిపై చేసిన అధ్యయనంలో నిద్రలేమి వల్ల మెదళ్లు అసలు వయసు కంటే ఓ ఏడాది ముందున్నట్లు గుర్తించారు. రోజుకు 7-8 గంటలు నిద్రపోతే ఈ ప్రమాదం ఉండదని వైద్యులు సూచిస్తున్నారు.
News October 5, 2025
‘జ్యోతిష శాస్త్రం’ ఏం చెబుతోందంటే?

ప్రతి జీవికీ కష్టసుఖాలు, జయాపజయాలు కర్మఫలితాలను బట్టే కలుగుతాయి. ఈ కర్మ ఫలాల విశ్లేషణకై, మనిషి జీవిత గమనాన్ని తెలుసుకోవడానికై, మన రుషీశ్వరులు ప్రసాదించిన దివ్యజ్ఞానమే జ్యోతిషశాస్త్రము. ఇది కేవలం జాతక ప్రభావాన్ని వివరించడమే కాక పూర్వ జన్మల పాపపుణ్య కర్మల రహస్యాన్ని వెల్లడిస్తుంది. మానవుడు తన జీవితాన్ని సరైన ధర్మమార్గంలో నడుపుకోవడానికి ఈ శాస్త్రం ఓ అమూల్యమైన సాధనమని పండితుల అభిప్రాయము. <<-se>>#doshaalu<<>>
News October 5, 2025
తెలంగాణలో కోల్డ్రిఫ్ సిరప్‌పై నిషేధం

TG: రాష్ట్రంలో కోల్డ్రిఫ్ <<17918452>>దగ్గు మందు<<>>సిరప్‌పై ప్రభుత్వం నిషేధం విధించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సిరప్ వల్ల 14 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దగ్గు మందులో 42% విష రసాయనం(DEG) ఉన్నట్లు తేలింది. ఇప్పటికే తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలు దీన్ని బ్యాన్ చేశాయి.