News April 21, 2025
ఏడాదికి 80లక్షల ఉద్యోగాలు సృష్టించాలి: అనంత్ నాగేశ్వరన్

2047కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే వచ్చే పదేళ్లపాటు ఏడాదికి 80 లక్షల ఉద్యోగాల కల్పన జరగాలని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత్ నాగేశ్వరన్ తెలిపారు. కొలంబో ఇండియా సమ్మిట్ 2025లో ఆయన ప్రసంగించారు. తయారీ రంగంలో GDPమరింత పెంచేలా ఉత్పాదకత సాధించాలని, దేశంలోని SMEలను మరింతగా ప్రోత్సహించాలని సూచించారు. పర్యావరణానికి ఎటువంటి హాని జరగకుండా అభివృద్ధి ప్రక్రియ ఉండాలన్నారు.
Similar News
News April 22, 2025
రెజిల్‌మేనియాకు వెళ్లిన తొలి భారత సెలబ్రిటీగా రానా

రెజిల్‌మేనియా కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. లాస్ వెగాస్‌లో జరిగిన రెజిల్‌మేనియా-41కి నటుడు రానా దగ్గుబాటి తాజాగా హాజరయ్యారు. ఆయన్ను ఆహ్వానించిన ఈవెంట్ నిర్వాహకులు ముందు వరుస సీటింగ్‌ను కేటాయించారు. కార్యక్రమం జరుగుతున్నప్పుడు రానా పేరును వారు అనౌన్స్ చేయడం విశేషం. రెజిల్‌మేనియాకు హాజరైన తొలి భారత సెలబ్రిటీగా రానా చరిత్ర సృష్టించారు.
News April 22, 2025
పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. భారత్‌లో 3 రోజులు సంతాప దినాలు

పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల గౌరవ సూచకంగా కేంద్రం మూడ్రోజులు సంతాప దినాలను ప్రకటించింది. ఈ నెల 22, 23 తేదీలు, అలాగే అంత్యక్రియలు నిర్వహించే రోజును కూడా సంతాప దినంగానే ప్రకటించింది. ఈ మూడ్రోజులు జాతీయ జెండాను సగం ఎత్తులోనే ఎగరవేయాలంది. ఎలాంటి అధికారిక వినోద కార్యక్రమాలు ఉండవని పేర్కొంది. 88 ఏళ్ల వయసులో పోప్ ఫ్రాన్సిస్ ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
News April 22, 2025
పోలీసు కస్టడీకి గోరంట్ల మాధవ్

AP: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను రెండ్రోజులు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు మొబైల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు 5 రోజులు కోరగా.. కోర్టు రెండ్రోజులు అనుమతించింది. గోరంట్లను ఈ నెల 23, 24 తేదీల్లో పోలీసులు విచారించనున్నారు. పోలీసు కస్టడీలో ఉన్న చేబ్రోలు కిరణ్‌పై గోరంట్ల దాడికి యత్నించారని కేసు నమోదైంది. ప్రస్తుతం గోరంట్ల రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.