News March 1, 2025

80% పెన్షన్ల పంపిణీ పూర్తి: TDP

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ వేగంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పెన్షన్ నగదు పంపిణీ కార్యక్రమం మూడు గంటల్లోనే 80 శాతం పూర్తైనట్లు టీడీపీ ట్వీట్ చేసింది. గత నెల వరకు తెల్లవారుజామున 5 గంటల నుంచే పెన్షన్లు పంపిణీ చేయగా.. ఉద్యోగులు, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పంపిణీ ప్రారంభ సమయాన్ని ప్రభుత్వం 7 గంటలకు మార్చిన విషయం తెలిసిందే.

Similar News

News March 1, 2025

కొవ్వెక్కిన పంది, నీతిమాలిన జెలెన్‌స్కీ: రష్యా ఫైర్

image

డొనాల్డ్ ట్రంప్, జెలెన్‌స్కీ వాగ్వాదంపై రష్యా ఘాటుగా స్పందించింది. ఎవరి మద్దతూ లేకుండా ఒంటరిగా యుద్ధం చేశానన్న జెలెన్‌స్కీ ఓ నీతిమాలిన వాడంటూ రష్యా ఫారిన్ మినిస్ట్రీ ప్రతినిధి మరియా జఖారోవా విమర్శించారు. వైట్‌హౌస్‌లో అతడికి తగిన శాస్తి జరిగిందన్నారు. మాజీ ప్రెసిడెంట్, సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ దిమిత్రి మెద్వెదేవ్ అయితే ఏకంగా ‘కొవ్వెక్కిన పంది’ అని తిట్టారు.

News March 1, 2025

సెమీఫైనల్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్!

image

ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ మాథ్యూ షార్ట్ సెమీస్‌లో ఆడేది అనుమానమేనని కెప్టెన్ స్టీవ్ స్మిత్ చెప్పారు. షార్ట్ గాయంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. అతని స్థానంలో మెక్ గుర్క్, అరోన్, కూపర్‌లలో ఒకరిని తీసుకుంటామని చెప్పారు. నిన్న వర్షం కారణంగా రద్దైన మ్యాచులో షార్ట్ 15 బంతుల్లో 20 పరుగులు చేసి ఔటయ్యారు.

News March 1, 2025

100 రోజుల్లోపే శిక్ష పడేలా పనిచేయాలి: హోంమంత్రి అనిత

image

AP: నేరం చేసిన వంద రోజుల్లోపే శిక్షలు పడేలా పనిచేయాలని ట్రైనింగ్ పూర్తి చేసుకున్న SIలకు హోంమంత్రి అనిత సూచించారు. నిజాయితీగా ప్రజల రక్షణకు ముందుకెళ్లాలన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సైల పాసింగ్ పరేడ్‌లో ఆమె పాల్గొన్నారు. మొత్తం 395 మంది ఎస్సైలుగా శిక్షణ పూర్తి చేసుకోగా వీరిలో 97 మంది మహిళలు ఉన్నారు. మహిళలు ఇంత సంఖ్యలో ఉండటం గర్వకారణమని అన్నారు. ఈ పరేడ్‌కు డీజీపీ హరీశ్ గుప్తా హాజరయ్యారు.

error: Content is protected !!