News June 16, 2024
ఆ కారణంతోనే TCSలో 80వేల ఖాళీలు!

దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్లో 80వేల ఖాళీలు ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. స్కిల్స్ ఉన్న అభ్యర్థుల కొరతతోనే వాటి భర్తీ ప్రక్రియ నిలిచిపోయినట్లు పేర్కొంది. నైపుణ్యాలు లేదా ఉద్యోగి ఆకాంక్షలు ప్రాజెక్టు అవసరాలకు సరిపోవడంలేదని ఆ సంస్థ ఉద్యోగి TOIకి వెల్లడించారు. కాగా గత రెండేళ్లుగా TCSలో ఉద్యోగ నియామక జాప్యం వల్ల 10వేల మంది ఫ్రెషర్లు ప్రభావితమైనట్లు NITES పేర్కొంది.
Similar News
News December 5, 2025
జుట్టు చివర్లు చిట్లుతున్నాయా..?

వాతావరణ మార్పుల వల్ల వెంట్రుకల చివర్లు చిట్లడం ఎక్కువైపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లు తలస్నానం చెయ్యాలి. తలస్నానానికి మైల్డ్ షాంపూలు వాడటం మంచిది. బయటకి వెళ్తున్నప్పుడు జుట్టంతా కప్పిఉంచుకోవాలి. తలస్నానం తర్వాత హెయిర్ సీరం వాడటం మంచిది. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మెడికేటెడ్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకూడదు. అయినా సమస్య తగ్గకపోతే ఒకసారి ట్రైకాలజిస్ట్లను సంప్రదించాలి.
News December 5, 2025
గూగుల్ డేటా సెంటర్కు 480 ఎకరాలు

AP: విశాఖలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్కు 480 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. విశాఖ(D)లోని తర్లువాడ, అడవివరం, అనకాపల్లి(D)లోని రాంబిల్లిలో భూమిని ఇచ్చేందుకు అంగీకరించింది. గూగుల్ విజ్ఞప్తి మేరకు ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న అదానీ ఇన్ఫ్రా పేరున కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దశల వారీగా వెయ్యి మెగా వాట్ల ఏఐ డేటా సెంటర్ను గూగుల్ ఏర్పాటు చేయనుంది.
News December 5, 2025
ఉప్పుతో ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే..?

ఉప్పుతో పెట్టే దీపాన్నే ఐశ్వర్య దీపం అంటారు. శుక్రవారం ఈ దీపాన్ని వెలిగిస్తే సిరిసంపదలకు లోటుండదని నమ్మకం. ఇలా 11, 21 వారాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక సమస్యలు దూరమవుతాయని పండితులు సూచిస్తున్నారు. ‘ఉప్పులో దృష్టి దోషాలను పోగొట్టే శక్తి ఉంటుంది. ఇంట్లో పసిపిల్లలకు ఎలాంటి దోషం కలగకూడదంటే ఈ దీపం వెలిగించాలి’ అని చెబుతున్నారు. ఉప్పు దీపం ఎలా వెలిగించాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


