News February 7, 2026
805 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

C-DAC 805 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల్లో HYDలో 105 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీజీ(సైన్స్, MCA, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు FEB 20 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ /స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdac.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
Similar News
News February 21, 2026
పిల్లలకు నెబులైజర్ వాడుతున్నారా?

వాతావరణం మారినపుడు, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినపుడు పిల్లల ఊపిరితిత్తుల్లో తెమడ చేరి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటప్పుడు మాత్రం నెబ్యులైజర్ వాడాలి. కానీ కొంతమంది ముక్కు దిబ్బడ, జలుబు వేగంగా తగ్గుతాయని సొంతంగానే నెబ్యులైజర్ వాడుతుంటారు. కానీ అది సరికాదు. డాక్టర్ సలహా మేరకే నెబ్యులైజర్‌ని ఉపయోగించాలి. ఒకవేళ పిల్లలకు అలర్జీ సమస్య ఉంటే అత్యవసర సమయంలో నెబ్యులైజర్ వాడచ్చు.
News February 21, 2026
నెటిజన్ దారుణ కామెంట్.. గట్టిగా బదులిచ్చిన చిన్మయి!

తనపై దారుణ కామెంట్ చేసిన నెటిజన్‌కు సింగర్ చిన్మయి గట్టిగా బదులిచ్చారు. దేశంలో చిన్నారులపై లైంగిక దాడులు చేసేవాళ్లు లక్షల్లో ఉన్నారని ఆమె ట్వీట్ చేయగా ‘నిన్ను మీ నాన్న రేప్ చేసుంటాడు’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ‘నా తండ్రి నన్ను రేప్ చేయలేదు. కానీ కూతుళ్లను తండ్రులు రేప్ చేస్తారని మీరు ఊహించుకుంటారు. ఇలా మాట్లాడుతున్నారంటే మీరేంటో, మిమ్మల్ని ఎవరు పెంచారో అర్థమవుతోంది’ అని చిన్మయి కౌంటరిచ్చారు.
News February 21, 2026
ఒక్క పెన్షన్ తొలగించలేదు: మంత్రి

AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్రమంగా ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అర్హులందరికీ ఒకటో తేదీనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. గత 20 నెలల్లో మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లినవారి పెన్షన్లు మాత్రమే రద్దు చేశామని వెల్లడించారు. పెన్షన్లు, రుణాలపై జగన్ నోటికొచ్చినట్లు మాట్లాడి, ప్రజల్లో భయాలు సృష్టిస్తున్నారని కొండపల్లి మండిపడ్డారు.


