News October 5, 2025

80’s రీయూనియన్.. చెన్నైకి చిరు, వెంకీ

image

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కలిసి చెన్నై వెళ్లారు. అక్కడ జరిగే 80’s రీయూనియన్‌లో వారు పాల్గొననున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. 80వ దశకంలో కలిసి నటించిన హీరోలు, హీరోయిన్లు ఒకే చోట కలవనున్నారు. ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుని సరదాగా గడుపుతారు. గతంలోనూ ఇలా చాలా సార్లు కలిశారు. కాగా ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీలో వెంకీ మామ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు.

Similar News

News October 5, 2025

ప్రభాస్ ‘స్పిరిట్’లో విలన్‌గా వివేక్?

image

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా రూపొందనున్న ‘స్పిరిట్’ సినిమా గురించి రోజుకో అప్‌డేట్ SMలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో విలన్‌గా బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ కీలక పాత్రలో మడోన్నా సెబాస్టియన్ కనిపిస్తారని సమాచారం. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే నెల 5 నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.

News October 5, 2025

రాబోయే 3 గంటల్లో వర్షం

image

TG: హైదరాబాద్‌లో రాబోయే 3 గంటల్లో వర్షం పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. వచ్చే 2-3 గంటల్లో భూపాలపల్లి, మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

News October 5, 2025

భారత్‌తో మ్యాచ్.. పాక్ కెప్టెన్ ఏమన్నారంటే?

image

ఉమెన్స్ క్రికెట్ WCలో ఇవాళ INDతో మ్యాచులో తమ ఆటతీరుపైనే ఫోకస్ పెడతామని PAK కెప్టెన్ ఫాతిమా సనా తెలిపారు. గతంలో ఇరు జట్ల ప్లేయర్లు ఫ్రెండ్లీగా ఫొటోలు దిగగా, ప్రస్తుత పరిస్థితులపై ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘అన్ని జట్ల ప్లేయర్లతో మాకు మంచి రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. అందరితో బాగుండేందుకు ప్రయత్నిస్తాం. గేమ్ స్పిరిట్‌కు అనుగుణంగా నడుచుకుంటాం. మా దృష్టంతా క్రికెట్‌పైనే’ అని స్పష్టం చేశారు.