News May 14, 2024

81శాతం పోలింగ్ నమోదు కావొచ్చు: ముకేశ్ కుమార్

image

AP: రాష్ట్రంలో మొత్తం 81శాతం పోలింగ్ నమోదు కావొచ్చని సీఈవో ముకేశ్ కుమార్ మీనా అభిప్రాయపడ్డారు. 1.2శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలుపుకొని ఇప్పటివరకు 79.40శాతం పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. సాయంత్రానికి పూర్తి వివరాలు వస్తాయన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకు ఓట్లు వేశారని మీనా వివరించారు.

Similar News

News March 23, 2026

‘రావణ కాష్ఠం’ అంటే ఏమిటి?

image

ఎప్పటికీ పరిష్కారం కాకుండా ఉండే సమస్యలను ప్రస్తావించేటప్పుడు ‘రావణ కాష్ఠం’ జాతీయాన్ని ఉపయోగిస్తాం. కాష్ఠం అంటే కర్ర/చెక్క. రావణుడు దుష్టుడు అయినప్పటికీ గొప్ప దైవ భక్తుడు. ఎన్నో యజ్ఞాలు, యాగాలు చేసేవాడు. అందులో ఓసారి వాడిన వస్తువులను మరోసారి వాడకూడదు. అలా దాచిన వస్తువులన్నింటినీ రావణుడి చితిపై వేసి విభీషణుడు తగలబెట్టారు. దీంతో ఆ చితి కొన్నేళ్లపాటు ఆరిపోకుండా మండుతూనే ఉందట.
<<-se>>#EPICSAYINGS<<>>

News March 23, 2026

PSL: విదేశీ ఆటగాళ్లకు పాక్ మిలిటెంట్ల హెచ్చరికలు!

image

పాక్ సూపర్ లీగ్(PSL)కు <<19452212>>వరుస షాక్‌లు<<>> తగులుతున్నాయి. విదేశీ ప్లేయర్లు టోర్నీ నుంచి వైదొలగాలని తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్(TTP) అనుబంధ జమాత్ ఉల్ అహ్రార్ హెచ్చరించింది. ‘ప్లేయర్లను పంపొద్దని సంబంధిత బోర్డులను కోరుతున్నాం. వారికి ఏదైనా జరిగితే మాది బాధ్యత కాదు. ఇప్పటికే హెచ్చరించాం. మ్యాచులు జరగకుండా చేయాల్సినదంతా చేస్తాం. క్రీడలు నిర్వహించే స్థితిలో పాకిస్థాన్ లేదు’ అని అడ్వైజరీ జారీ చేసింది.

News March 23, 2026

యుద్ధం.. స్టాక్ మార్కెట్లలో కల్లోలం

image

పశ్చిమాసియా సంక్షోభంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 601.8 పాయింట్ల నష్టంతో 22,512 వద్ద, సెన్సెక్స్ 1,836 పాయింట్లు కోల్పోయి 72,696 వద్ద క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్‌లో అత్యధికంగా టైటాన్ 6.99%, ట్రెంట్ 6.21%, అల్ట్రాటెక్ 5.40%, భారత్ ఎలక్ట్రానిక్స్ 4.94%, టాటా స్టీల్ 4.93% నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 93.95కి పడిపోయి రికార్డు కనిష్ఠాలను తాకింది.