News October 30, 2025

81 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో 81 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని NOV 10 లోపు స్పీడ్ పోస్టు ద్వారా పంపాలి. పోస్టును బట్టి PhD, మాస్టర్ డిగ్రీ, NET, CSIR, BE, బీటెక్, ME, ఎంటెక్, MS, MBBS, డిగ్రీ, ఇంటర్ , టెన్త్, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.cuk.ac.in/

Similar News

News October 30, 2025

అయోధ్య రామునికి రూ.3వేల కోట్ల విరాళం

image

అయోధ్యలో రామ మందిరం కోసం 2022 నుంచి ఇప్పటి వరకు రూ.3వేల కోట్లకుపైగా విరాళాలు అందాయి. ఇందులో దాదాపు రూ.1,500 కోట్లను నిర్మాణం కోసం ఖర్చు చేసినట్లు రామమందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. నవంబర్ 25న ఆలయంలో జరిగే జెండా ఆవిష్కరణ వేడుకకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మరో 8 వేల మందిని ఆహ్వానించనున్నట్లు చెప్పారు.

News October 30, 2025

APPLY NOW: MGAHVలో ఉద్యోగాలు

image

మహాత్మాగాంధీ అంతర్ రాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలయం 23 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం https://hindivishwa.org/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

News October 30, 2025

గుమ్మడి కాయలను ఎప్పుడు కోస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి?

image

గుమ్మడి పంట నాటిన 75 నుంచి 80 రోజులకు గుమ్మడి తీగపై కాయలు ఏర్పడతాయి. లేత కాయలు త్వరగా చెడిపోతాయి. కాబట్టి బాగా ముదిరి, పండిన కాయలనే కోయాలి. ముదిరిన కాయలు 4 నుంచి 6 నెలల వరకు నిల్వ ఉంటాయి. కాబట్టి ఎంత దూరపు మార్కెట్‌కైనా సులభంగా తరలించవచ్చు. కాయల్ని తొడిమతో సహా కోసి, కొన్ని రోజుల పాటు ఆరనివ్వాలి. కోసిన కాయలను శుభ్రపరచి సైజులను బట్టి గ్రేడింగ్ చేసి మార్కెట్‌కు పంపాలి.