News October 10, 2025

8,113 ఉద్యోగాలు.. అడ్మిట్ కార్డులు విడుదల

image

RRB 8,113 NTPC గ్రాడ్యుయేట్ పోస్టులకు అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. స్టేజ్ 2 కంప్యూటర్ ఆధారిత పరీక్ష అక్టోబర్ 13న నిర్వహించనుంది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇటీవల సీబీటీ -1 ప్రాథమిక కీ, కట్ ఆఫ్ మార్కుల వివరాలను రైల్వే బోర్డు ప్రకటించింది. వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in/

Similar News

News October 10, 2025

నోబెల్ బహుమతి ట్రంప్‌కు అంకితం: మరియా

image

వెనిజులా ప్రజలకు మద్దతిచ్చిన US అధ్యక్షుడు ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతిని అంకితమిస్తున్నట్లు ఉద్యమకారిణి మరియా మచాడో ప్రకటించారు. ట్రంప్‌తో పాటు నిర్విరామంగా పోరాడుతున్న తమ దేశ ప్రజలకు, అండగా నిలబడ్డ ప్రపంచ దేశాలకు ఈ బహుమతి డెడికేట్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య దేశాలు తమకు ప్రధాన మిత్రులని చెప్పారు. ఫ్రీడమ్ సంపాదించడానికి నోబెల్ ప్రకటన మరింత ప్రోత్సాహాన్నిస్తుందని ఆమె వివరించారు.

News October 10, 2025

మంత్రులూ! ప్రాజెక్టుల పూర్తి బాధ్యత మీదే: CBN

image

AP: శాఖలను సమర్థంగా నడపాల్సిన బాధ్యత మంత్రులదేనని CM CBN స్పష్టం చేశారు. ‘గతంలో లేనన్ని పెట్టుబడులు వస్తున్నాయి. శాఖల అధికారులతో మాట్లాడి త్వరగా పనులు చేయించండి. మాట వినకుంటే గట్టిగా చెప్పండి. అవి సకాలంలో పూర్తికావాలి. ప్రజలకూ చెప్పాలి. ఎన్నికల్లో పోటీచేసేది మీరే అని తెలుసుకోండి’ అని క్యాబినెట్ చివర్లో సీఎం హితబోధ చేసినట్లు సమాచారం. YCP కుట్రల్ని తిప్పికొట్టాలని నిన్నకూడా వారికి బాబు సూచించారు.

News October 10, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* ఇవాళ రాత్రి లండన్ పర్యటనకు బయల్దేరనున్న మాజీ CM YS జగన్ దంపతులు
* అమ్మాయిల సమస్యల ఫిర్యాదుకు త్వరలో ఆన్‌‌లైన్ పోర్టల్ తెస్తామన్న మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ
* ఆర్‌పేట సీఐపై చిందులేసిన మాజీ మంత్రి పేర్ని నానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ విద్యాసాగర్
* చంద్రబాబు నాయకత్వంలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిపోయిందన్న మాజీ మంత్రి విడదల రజనీ