News October 16, 2024

8113 ఉద్యోగాలు.. మరో నాలుగు రోజులే గడువు

image

రైల్వేలో 8113 ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవల్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ రైలు మేనేజర్, టైపిస్ట్, క్లర్క్ పోస్టుల్లో ఖాళీలున్నాయి. 18 నుంచి 36 ఏళ్లలోపు ఉన్న అభ్యర్థులు ఈ నెల 20 తేదీలోపు అప్లై చేసుకోవాలి. రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంటుంది. సికింద్రాబాద్ రీజియన్లో-478 ఖాళీలున్నాయి. దరఖాస్తు చేసేందుకు ఈ <>లింక్‌<<>>పై క్లిక్ చేయండి.

Similar News

News October 16, 2024

GHMC కమిషనర్‌గా ఇలంబర్తి

image

TG: ఏపీకి అలాట్ చేసిన ఐఏఎస్‌లను <<14375321>>రిలీవ్<<>> చేసిన ప్రభుత్వం వారి స్థానాల్లో సీనియర్లకు అదనపు బాధ్యతలు అప్పగించింది. GHMC కమిషనర్‌గా ఇలంబర్తి, ఎనర్జీ సెక్రటరీగా సందీప్ కుమార్ సుల్తానియా, ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రటరీగా శ్రీదేవి, టూరిజం అండ్ కల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీధర్, ఆరోగ్య శ్రీ సీఈవోగా ఆర్వీ కర్ణన్‌కు అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

News October 16, 2024

ఐఏఎస్‌లను రిలీవ్ చేస్తూ TG ప్రభుత్వం ఉత్తర్వులు

image

ఏపీకి కేటాయించిన ఐఏఎస్‌లను రిలీవ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, వాకాటి కరుణ, రోనాల్డ్ రాస్, వాణి ప్రసాద్‌ను ఏపీకి అలాట్ చేస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

News October 16, 2024

గ్రూప్-1 నియామకాలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

image

TG: గ్రూప్-1 నియామక ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 నియామకాల్లో దివ్యాంగుల రిజర్వేషన్ల అంశంపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ విచారణ జరిపింది. నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తిస్థాయి వాదనల కోసం విచారణను నవంబర్ 20కి వాయిదా వేసింది. కాగా ఈనెల 21 నుంచి మెయిన్స్ పరీక్షలున్నాయని, 3 నెలల్లో ఫలితాలు విడుదల చేస్తామని TGPSC కోర్టుకు తెలిపింది.