News March 19, 2024
ఏపీలో 83 శాతం పోలింగ్ లక్ష్యం

AP: రాష్ట్రవ్యాప్తంగా 2019 ఎన్నికల్లో 79 శాతం పోలింగ్ నమోదవగా, ఈసారి 83 శాతం లక్ష్యంగా పెట్టుకున్నట్లు SEC వెల్లడించింది. 2019లో 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 70 శాతంలోపే పోలింగ్ నమోదైంది. దీంతో ఆ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించనుంది. పట్టణాలు, ఏజెన్సీల్లో యువతలో చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు నిర్వహించనుంది. గత ఎన్నికల్లో అత్యల్పంగా విశాఖ వెస్ట్లో 56.3 శాతం పోలింగ్ నమోదైంది.
Similar News
News March 30, 2025
కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం

TG: రాష్ట్రంలో మరో కొత్త పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో జరిగిన కార్యక్రమంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. ఇకపై రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందజేయనున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది. దీంతో 3.10 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. 10 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నారు.
News March 30, 2025
అందుకే పిల్లలు వద్దనుకున్నా: తెలుగు డైరెక్టర్

‘గబ్బర్ సింగ్’ డైరెక్టర్ హరీశ్ శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ బాధ్యతల కోసం పిల్లలను వద్దనుకున్నట్లు చెప్పారు. తనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని, తన భార్య సపోర్టుతో చెల్లెలికి పెళ్లి, తమ్ముడిని సెటిల్ చేసినట్లు వెల్లడించారు. పిల్లలు ఉంటే స్వార్థంగా బతుకుతామని ఆలోచించి తన భార్యతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
News March 30, 2025
‘మ్యాడ్ స్క్వేర్’ రికార్డ్ కలెక్షన్లు

‘MAD’కు సీక్వెల్గా రూపొందిన ‘మ్యాడ్ స్క్వేర్’కు హిట్ టాక్ రావడంతో కలెక్షన్లలో దూసుకెళ్తోంది. శుక్రవారం రిలీజైన ఈ మూవీ రెండ్రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.37.2 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ టీం ప్రకటించింది. ఈ మేరకు బ్లాక్బస్టర్ మ్యాక్స్ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇవాళ, రేపు కూడా సెలవులు ఉండటంతో కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.