News March 18, 2024
దర్శక ధీరుడికి 83 ఏళ్ల ఫ్యాన్ స్పెషల్ గిఫ్ట్

RRR సినిమాతో దర్శక ధీరుడు రాజమౌళికి జపాన్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. తాజాగా జపాన్‌లో ఓ వృద్ధురాలు రాజమౌళి దంపతులకు ప్రత్యేక బహుమతిని అందజేశారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విటర్‌లో తెలియజేశారు. ‘రాజమౌళి గారు.. జపాన్‌కు స్వాగతం. నాకు 83 ఏళ్లు. నేను RRRతో డాన్స్ చేయాలని ప్రతిరోజు అనుకుంటున్నా’ అని బహుమతిపై ఆ ఫ్యాన్ పేర్కొన్నారు. తమకు ఇష్టమైన వారు ఆయురారోగ్యాలతో ఉండాలని జపాన్‌లో ఈ బహుమతులు ఇస్తుంటారు.
Similar News
News January 1, 2026
నైనిటాల్ బ్యాంక్‌లో 185పోస్టులు… అప్లైకి కొన్ని గంటలే సమయం

నైనిటాల్ బ్యాంక్‌లో 185 పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా కొన్ని గంటలే సమయం ఉంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ/పీజీ, CA, MBA,LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. JAN 18న ఎగ్జామ్ నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు CSA పోస్టులకు రూ.1000, స్కేల్ 1, 2పోస్టులకు రూ.1500. వెబ్‌సైట్: https://www.nainitalbank.bank.in
News January 1, 2026
‘స్వర్ణ పంచాయతీ’తో ₹200 కోట్ల ఆదాయం

AP: ‘స్వర్ణ పంచాయతీ’ పేరిట ప్రభుత్వం తెచ్చిన ఆన్‌లైన్ చెల్లింపుల పోర్టల్ సత్ఫలితాలు ఇస్తోంది. 13వేల పంచాయతీల్లోని 88 లక్షల ఆస్తుల్ని గుర్తించి ₹1052 కోట్ల పన్ను(FY24-25) మొత్తాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. ఎవరితోనూ సంబంధం లేకుండా నేరుగా చెల్లించే విధానంతో ప్రజల నుంచి స్పందన వస్తోంది. ఇప్పటికే ₹200Cr వసూలయ్యాయి. గతంలో పన్ను వసూళ్లలో అక్రమాలు జరిగేవి. కొత్త విధానం వాటికి అడ్డుకట్ట వేసింది.
News January 1, 2026
2026 గురించి నోస్ట్రడామస్ ఏం చెప్పారు?

ఫ్రెంచ్ ఫిలాసఫర్ నోస్ట్రడామస్ 2026లో ప్రపంచం పలు విపత్తులను ఎదుర్కోనుందని అంచనా వేశారు. తాను రాసిన Les Prophéties బుక్‌లో వీటిని ప్రస్తావించారు.
1. ప్రపంచ యుద్ధ స్థాయిలో పోరాటాలు.
2. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం.
3. నిర్ణయాధికారం కృత్రిమ మేధ చేతుల్లోకి. (AI ఆధిపత్యం)
4. సముద్రంలో భారీ విపత్తు లేదా ఉద్రిక్తతలు.
5. నీటి సంబంధిత ప్రకృతి విపత్తులు.
** 1566లో తాను మరణిస్తానని ముందుగానే చెప్పారు.


