News May 12, 2024

85శాతంకు పోలింగ్ పెంచే లక్ష్యం: అల్లూరి కలెక్టర్

image

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈనెల 13వ తేదీ సోమవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత పేర్కొన్నారు. గత ఎన్నికల కన్నా పోలింగ్ శాతం పెంచేందుకు గ్రామస్థాయిలో ఓటర్లకు అవగాహన కల్పించామని తెలిపారు. ఈసారి 85శాతం వరకు పోలింగ్ పెంచే లక్ష్యం మేరకు ఏర్పాట్లు చేశామన్నారు. ముందుగా లోక్ సభకు, తరువాత అసెంబ్లీ స్థానానికి ఓటు హక్కు కల్పిస్తున్నామన్నారు.

Similar News

News November 7, 2025

విశాఖ: పెండింగ్ బిల్లులు చెల్లించాలని ధర్నా

image

13 నెలలుగా పెండింగ్‌లో ఉన్న రూ.400 కోట్లలో కనీసం 6 నెలల బిల్లులను వెంటనే చెల్లించాలని GVMC కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. శుక్రవారం GVMC గాంధీ విగ్రహ వద్ద నల్ల రిబ్బన్లు ధరించి ధర్నా చేపట్టారు. బిల్లులు చెల్లించకపోతే ఇక పనులు చెయ్యలేమన్నారు. GVMC బడ్జెట్ ఉన్న వర్కులకు మాత్రమే టెండర్లు పిలవాలన్నారు. ధర్నా అనంతరం ర్యాలీగా వెళ్లి GVMC కమిషనర్, మేయర్‌‌కు వినతిపత్రం అందజేశారు.

News November 7, 2025

విశాఖ: పాఠశాలలకు రేపు సెలవు రద్దు

image

విశాఖలో రేపు రెండో శనివారం సందర్భంగా సెలవు రద్దు చేసినట్లు డీఈవో ఎన్.ప్రేమ్ కుమార్ శుక్రవారం ప్రకటించారు. తుఫాన్ కారణంగా అక్టోబర్ 27న పాఠశాలలకు సెలవు ఇవ్వడంతో.. ఆ రోజుకు బదులుగా రేపు పని దినంగా నిర్ణయించారు. ఈ మేరకు అన్ని మేనేజ్‌మెంట్‌ల పాఠశాలలు రేపు సాధారణంగా పనిచేయాలని, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు గమనించాలని సూచించారు.

News November 7, 2025

విశాఖ రేంజ్‌లో వందేమాతరం గీతాలాపన

image

విశాఖ రేంజ్‌ పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం ‘వందేమాతరం’ గీతాలాపన చేశారు. జాతీయ గీతాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డీఐజీ గోపీనాథ్‌ జెట్టి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను స్మరించుకోవాలని, జాతీయ గీతాల పట్ల గౌరవ భావం కలిగి ఉండాలని సూచించారు.