News May 12, 2024

85శాతంకు పోలింగ్ పెంచే లక్ష్యం: అల్లూరి కలెక్టర్

image

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈనెల 13వ తేదీ సోమవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత పేర్కొన్నారు. గత ఎన్నికల కన్నా పోలింగ్ శాతం పెంచేందుకు గ్రామస్థాయిలో ఓటర్లకు అవగాహన కల్పించామని తెలిపారు. ఈసారి 85శాతం వరకు పోలింగ్ పెంచే లక్ష్యం మేరకు ఏర్పాట్లు చేశామన్నారు. ముందుగా లోక్ సభకు, తరువాత అసెంబ్లీ స్థానానికి ఓటు హక్కు కల్పిస్తున్నామన్నారు.

Similar News

News February 12, 2025

విశాఖలో హత్యకు గురైన MRO భార్యకు ఉద్యోగం

image

విజయనగరం జిల్లా బొండపల్లి ఎమ్మార్వో రమణయ్య గతేడాది ఫిబ్రవరి 2న విశాఖలో హత్యకు గురయ్యారు. ఈ మేరకు ఆయన సతీమణి అనూషకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కారుణ్య నియామక పత్రాన్ని బుధవారం అందజేశారు. హత్యకు గురైన సమయంలో మంత్రికి అనూష విన్నపం చేశారు. అప్పట్లో మంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుంచి డిప్యూటీ తహశీల్దార్‌గా నియామక పత్రం అందించారు.

News February 12, 2025

భీమిలి: బెదిరించి డబ్బులు లాక్కున్న ఘటనపై కేసు నమోదు

image

లీలా వరప్రసాద్ ఇద్దరు స్నేహితులతో సోమవారం రాత్రి టిఫిన్ కోసం వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి డబ్బులు డిమాండ్ చేశారు. ఓ కాలేజీ సమీపంలో వారిని భయపెట్టి, కొట్టి రూ.1,000 లాక్కున్నారు. మరో రూ.5,000 తీసుకురమ్మని ముగ్గురు స్నేహితుల్లో ఒకరిని పంపించి బెదిరించారు. భీమిలి పోలీస్ స్టేషన్లో వరప్రసాద్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 12, 2025

రూ.4కోట్లతో సింహాచలం ఆలయ పైకప్పుకు మరమ్మతులు 

image

సింహాచలంలో దేవాలయం పైకప్పు వర్షపు నీటి లీకేజీ నివారణ ప్రాజెక్టు ఒప్పందం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసురావు పాల్గొన్నారు. పుణేకు చెందిన కంపెనీ పనులు చేయడానికి ముందుకు వచ్చింది. 9 నెలల్లో రూ.4కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు. దేవాలయ కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సున్నం, అరబిక్ చెట్ల జిగురు, బెల్లం, జనపనార మిశ్రమాన్ని వాడి లీకేజీలు నివారిస్తామన్నారు.

error: Content is protected !!