News November 27, 2024

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు 85% బోనస్!

image

తమ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్‌తో ముగిసిన Q2కి మంచి పనితీరు కనబరిచిన ఉద్యోగులకు పర్ఫార్మెన్స్ బోనస్ ప్రకటించింది. ఇది వారి జీతంలో 85% ఉన్నట్లు సమాచారం. నవంబర్ నెల జీతంతో పాటు దీన్ని చెల్లించనుంది. డెలివరీ అండ్ సేల్స్ విభాగంలోని జూనియర్, మిడ్ లెవల్ ఉద్యోగులకు బోనస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే వచ్చే జనవరి నుంచి జీతాలు పెంచనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News November 27, 2024

త్వరలోనే డీఎస్సీ-2008 అభ్యర్థుల నియామకం

image

TG: డీఎస్సీ-2008 అభ్యర్థుల నియామక ప్రక్రియ కొలిక్కి వచ్చింది. 1400 మంది ఉద్యోగాలు చేయడానికి ముందుకు రాగా త్వరలోనే వీరిని కాంట్రాక్టు టీచర్లుగా నియమించనుంది. ఇప్పటికే వీరికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. ఇటీవల 10వేల మంది కొత్త టీచర్లను నియమించగా వీరి సర్దుబాటుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా SGT పోస్టుల్లో 30% డీఈడీ పూర్తి చేసిన వారికి కేటాయించడంతో కొందరు అభ్యర్థులు నష్టపోయారు.

News November 27, 2024

అఖిల్‌కు కాబోయే మామ బ్యాక్‌గ్రౌండ్ ఇదే..!

image

అఖిల్ అక్కినేనికి కాబోయే భార్య తండ్రి జుల్ఫీ రవ్‌డ్జీ గత జగన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సలహాదారుగా పని చేశారు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా క్యాబినెట్ హోదాలో ఉండేవారు. రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ వ్యాపారాలు చేసే జుల్ఫీ కుమారుడు జైన్ ప్రస్తుతం ZR Renewable Energy Pvt Ltd. ఛైర్మన్, ఎండీగా ఉన్నారు.

News November 27, 2024

న్యాయం చేయండి: 317 జీవో బాధితులు

image

TG: గత ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోపై కాంగ్రెస్ సర్కార్ వేసిన సబ్ కమిటీ రిపోర్ట్‌ను బహిర్గతం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. అసలు అందులో ఏముందో చెప్పాలంటున్నారు. అధికారంలోకి రాగానే 48 గంటల్లో 317 జీవోను రద్దు చేస్తానన్న హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. సొంత జిల్లాలకు దూరంగా ఉంటున్న తమకు స్థానికత ఆధారంగా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.