News April 12, 2025
3 నెలల్లో 85వేల వీసాలు.. చైనా స్నేహహస్తం!

సరిహద్దు వివాదాలతో భారత్తో కయ్యానికి కాలుదువ్వే చైనా కొంతకాలంగా మెతక వైఖరి అవలంబిస్తోంది. ఇటీవల సరిహద్దుల నుంచి తమ బలగాలను ఉపసంహరించుకున్న చైనా తాజాగా భారతీయులకు వీసాల జారీ ప్రక్రియను సులభతరం చేసింది. గత 3 నెలల్లో 85 వేల వీసాలు ఇచ్చామని చైనీస్ ఎంబసీ తెలిపింది. ‘చైనాను సందర్శించేందుకు మరింత మంది ఇండియన్ ఫ్రెండ్స్కు స్వాగతం’ అని ట్వీట్ చేసింది.
Similar News
News April 13, 2025
రాష్ట్రంలో మరింత మండిపోనున్న ఎండలు

తెలంగాణలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇవాళ అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 40-44 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఏప్రిల్ 18 నుంచి వడగాలులు మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అయితే, ఏప్రిల్ 15-17 మధ్య మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.
News April 13, 2025
VIRAL: మా అమ్మకు నానమ్మ, తాతయ్య నచ్చరు: విద్యార్థిని

TG: రాజన్న సిరిసిల్ల(D) చందుర్తిలో ఓ నాలుగో తరగతి విద్యార్థిని పరీక్షలో ఆసక్తికర సమాధానం రాసింది. ఇంగ్లిష్ ప్రశ్నాపత్రంలో ‘మీ అమ్మకు నచ్చిన, నచ్చనివి ఏవి’ అని అడిగారు. అమ్మకు నానమ్మ, తాతయ్య నచ్చరని విద్యార్థిని సమాధానం రాసింది. ఇందుకు సంబంధించిన ఫొటో SMలో వైరల్ అవుతుండగా, నేటి కాలంలో కోడళ్లకు అత్తమామల పట్ల ఎలాంటి భావన ఉందో దీని ద్వారా తెలుస్తోందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News April 13, 2025
అభిషేక్.. రప్పా.. రప్పా!

IPL: 246 పరుగుల భారీ లక్ష్యఛేదనలో SRH దుమ్మురేపుతోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ 40 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నారు. 6 సిక్సర్లు, 11 ఫోర్లతో పంజాబ్ బౌలర్లను ఊచకోత కోశారు. మరో ఓపెనర్ హెడ్ (37 బంతుల్లో 66) మెరుపులు మెరిపించి ఔటయ్యారు. SRH విజయానికి మరో 42 బంతుల్లో 71 పరుగులు అవసరం.