News May 15, 2024
పిఠాపురంలో 86.33% పోలింగ్

AP: కాకినాడ జిల్లా పిఠాపురంలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఈ సారి 86.33% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 2014లో 79.44%, 2019లో 80.92% కాగా, ఈ సారి దాదాపు 5% పెరిగింది. పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిసినప్పటి నుంచి అందరి దృష్టి పిఠాపురంపై పడింది. వైసీపీ తరఫున వంగా గీత బరిలో నిలిచారు. మరి జూన్ 4న వెలువడే ఫలితాల్లో విజయం ఎవరిదనేది ఆసక్తికరంగా మారింది.
Similar News
News March 4, 2026
YELLOW ALERT: 5 రోజులు జాగ్రత్త

TG: రాష్ట్రంలో మార్చిలోనే ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. అటు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో HYD వాతావరణ కేంద్రం పిడుగులాంటి వార్త చెప్పింది. రానున్న 5 రోజులు ఉష్ణోగ్రతలు 36-40 డిగ్రీలు నమోదవుతాయని వెల్లడించింది. ఈ నెల 7 నుంచి 33 జిల్లాలకూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. మీ ఏరియాల్లో టెంపరేచర్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News March 4, 2026
ఇరాన్ నౌకపై అమెరికా దాడి.. 100 మంది మృతి!

శ్రీలంకలో <<19296909>>ఇరాన్ నౌక<<>>పై జరిగిన దాడిలో 100 మంది చనిపోయారని తెలుస్తోంది. IRIS Dena షిప్ మునిగిపోయిందని, పలు బాడీలను గుర్తించామని శ్రీలంక నేవీ పేర్కొంది. నౌకలో 180 మంది సిబ్బంది ఉండగా, 30 మందిని కాపాడామని చెప్పింది. ఈ దాడి చేసింది తామేనని అమెరికా ప్రకటించింది. సబ్‌మెరైన్‌తో నౌకను పేల్చేసినట్లు వెల్లడించింది. FEB 18న విశాఖలో జరిగిన విన్యాసాల్లో ఈ షిప్ పాల్గొని తిరిగి వెళ్తుండగా అటాక్ జరగడం గమనార్హం.
News March 4, 2026
24,800 మంది బోగస్ ఉద్యోగులు… జీతం కింద ప్రైవేటు ఏజెన్సీలకు రూ.కోట్లు

TG: GOVTలో దాదాపు 3.70L మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తున్నారని, వారిలో 24,800 మంది బోగస్ ఉద్యోగులేనని మాజీ CS శాంతి కుమారి కమిటీ తేల్చింది. ఇంకా 14 శాఖల వివరాలు వస్తే ఈ సంఖ్య మరింత పెరగనుంది. బ్యాంకుఖాతా, పాన్, ఆధార్ లేకుండానే 10 ఏళ్లకు పైగా జీతం కింద ప్రైవేటు ఏజెన్సీలకు రూ.కోట్లు ఇస్తున్నారు. ఈ రిపోర్టు CMకు అందగా, వారి జీతాల చెల్లింపును నిలిపేయాలని ఆయన ఆదేశించారు.


