News October 5, 2025
భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 86 పోస్టులు

సంగారెడ్డిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL) 86 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. గ్రాడ్యుయేట్, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈనెల 14లోగా అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఈ నెల 10లోగా NATS పోర్టల్‌లో ఎన్‌రోలింగ్ కావాలి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.9వేలు, డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.8వేలు అందజేస్తారు. వెబ్‌సైట్: https://bdl-india.in/
Similar News
News October 5, 2025
భగవంతుడు అవతారాలు ఎందుకెత్తాడు?

నిర్గుణంచేంద్రియాతీతం, నిరాకారం నిరంజనం |
స్వభక్త రక్షణార్థాయ, జాయతేహి యుగేయుగే ||
పరిత్రాణాయ సాధూనాం, వినాశాయచ దుష్కృతామ్ |
ధర్మసంస్థాపనార్థాయ, సంభవామి యుగేయుగే ||
భగవంతుడు గుణములు, ఇంద్రియాలు లేనివాడు. నిరాకారుడు. నిరంజనుడు. అయినా తన భక్తులకు కాపాడుకోవడానికి సిద్ధపడతాడు. సజ్జనులను రక్షించాలని, దుష్టులను శిక్షించాలని, ధర్మమును కాపాడాలని అవతారాలు ఎత్తాడు. <<-se>>#WhoIsGod<<>>
News October 5, 2025
మహిళల్లో గుండెపోటు.. కారణాలివే!

ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల పురుషులతో పోల్చితే మహిళల్లో గుండెపోటు మరణాలు తక్కువ. అయితే ఇటీవల మహిళల్లోనూ ఈ తరహా మరణాలు సంభవిస్తున్నాయి. వీటికి అధిక బరువు, కొలెస్ట్రాల్, బీపీ, షుగర్, పొగ తాగడం, రుతుక్రమం ఆగడానికి మాత్రల వాడకం వంటివి ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు. 35ఏళ్లు పైబడిన మహిళలు కొన్ని కచ్చితమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
News October 5, 2025
మీకు తెలుసా? మహిళల్లోనే బలమైన ఇమ్యూన్ సిస్టమ్

పురుషుల కంటే మహిళల సగటు జీవిత కాలం ఎక్కువని అందరికీ తెలుసు. దీనికి మగాళ్ల శరీరంలో కంటే బలమైన రోగనిరోధక వ్యవస్థలు ఉండటమే కారణమని అధ్యయనాల్లో తేలింది. స్త్రీలలో ఉండే రెండు X క్రోమోజోములతోపాటు ఈస్ట్రోజెన్ హార్మోన్‌లు బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఒకరికి జన్మనిచ్చి, సంరక్షించడంలో మహిళలదే కీలకపాత్ర కావడంతో కాలక్రమేణా వారిలో ఇమ్యూన్ సిస్టమ్ అభివృద్ధి చెందినట్లు అంచనా.