News October 5, 2025

పవర్‌గ్రిడ్‌లో 866 అప్రెంటిస్‌లు.. అప్లైకి రేపే ఆఖరు తేదీ

image

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో 866 అప్రెంటిస్‌లకు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి ITI, డిప్లొమా, డిగ్రీ, PG ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్, సివిల్, రాజ్‌భాష, ఎగ్జిక్యూటివ్ లా విభాగాల్లో APలో 34, TGలో 37 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. స్టైపెండ్ రూ.13,000 నుంచి రూ.17,500 వరకు ఉంటుంది. వెబ్‌సైట్: powergrid.in

Similar News

News October 5, 2025

వారానికి మటన్ ఎంత తింటే మంచిదంటే?

image

మటన్‌లో శరీరానికి కావాల్సిన 9 రకాల అమైనో ఆమ్లాలు, మినరల్స్, ఐరన్ ఉంటుంది. ఇవి శరీర నిర్మాణానికి, కండరాల మరమ్మతులకు దోహదపడతాయి. అయినా అతిగా తింటే ఆరోగ్య సమస్యలొస్తాయని వైద్యులు చెబుతున్నారు. ‘సాధారణ ప్రజలు వారానికి 100 గ్రా., శారీరక శ్రమ చేసేవాళ్లు 200 గ్రా. వరకు తినొచ్చు. అతిగా తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు, సరిగ్గా అరగక జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదముంది’ అని హెచ్చరిస్తున్నారు.

News October 5, 2025

బత్తాయిలో ‘తొడిమ కుళ్లు’ తెగులు లక్షణాలు

image

బత్తాయి తోటల్లో కాయ తయారయ్యే దశలో తొడిమ కుళ్లు తెగులు ఆశించి నష్టాన్ని కలిగిస్తుంది. దీనినే వడప, బొడ్డుకుళ్లు తెగులు అని కూడా అంటారు. కాయ పక్వానికి రాకముందే చిన్న సైజులో ఉన్నప్పుడే తొడిమ నుంచి ఊడి రాలిపోవడం ఈ తెగులు ప్రధాన లక్షణం. కొమ్మ చివరి భాగాల్లో, అభివృద్ధి చెందుతున్న కాయ తొడిమలపై ఈ తెగులు ప్రభావం ఎక్కువ. చిన్న కాయలుగా ఉన్నప్పుడే రాలిపోవడం వల్ల దిగుబడి తగ్గి రైతుకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

News October 5, 2025

ఇవే మన పతనానికి కారణం..

image

మనిషి పతనానికి, ప్రకృతి వినాశనానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలు కారణం. ఇవి ఉంటే మనసు స్వార్థంతో, సంకుచిత భావాలతో నిండి ఉంటుంది. దుఃఖానికి ఇవే హేతువులు. మనిషికి నిజమైన శత్రువులు వారిలోని ఈ ఆరు వికారాలే. ఇవి సామాన్యులను పతనం వైపు మళ్లించి అధములుగా మారుస్తాయి. అరిషడ్వర్గాలను జయించినప్పుడే భగవత్తత్వం బోధపడుతుంది. మహాత్ములలో ఈ గుణాలపై విజయం లోక కళ్యాణానికి దారితీస్తుంది.