News July 4, 2024

టన్ను ఇసుక రూ.88

image

AP: <<13558406>>ఉచిత<<>> ఇసుక విధానంపై అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. గతంలో టన్ను ₹475 చొప్పున విక్రయించారు. కాంట్రాక్టర్, రవాణా ఖర్చు ₹100 తీసేయగా మిగిలిన ₹375 ప్రభుత్వానికి చేరేది. ఇకపై ఆ మొత్తం కాకుండా రూ.88 వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ఆ డబ్బునూ స్థానిక సంస్థలకే కేటాయిస్తారు. ₹88తోపాటు స్టాక్ పాయింట్‌లో లోడింగ్ ఖర్చు, రవాణా వ్యయాన్ని(దాదాపు ₹100) కలెక్టర్లు ఖరారు చేస్తారు.

Similar News

News January 19, 2026

మోదీ బయోపిక్‌లో హాలీవుడ్ స్టార్.. బడ్జెట్ రూ.400కోట్లు

image

PM మోదీ బయోపిక్‌ను ‘మా వందే’ అనే టైటిల్‌తో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మోదీ పాత్రలో మలయాళ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. క్రాంతికుమార్ డైరెక్ట్ చేస్తుండగా సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై వీర్ రెడ్డి రూ.400కోట్లతో నిర్మిస్తున్నారు. ‘ఆక్వామెన్’ ఫేమ్ జేసన్ మమోవాను ఓ పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు మూవీ టీమ్ పేర్కొంది. JAN 22 నుంచి కశ్మీర్‌లో రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది.

News January 19, 2026

ఇక శాంతి గురించి ఆలోచించను: ట్రంప్

image

ఎనిమిది యుద్ధాలను ఆపినా నోబెల్ శాంతి బహుమతి దక్కలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్‌కు ఆయన లేఖ రాశారు. ఇకపై శాంతి గురించి ఆలోచించనని, అమెరికా ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. నోబెల్ ఇవ్వకపోవడమే తన దృక్పథం మారడానికి కారణమని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ లీక్ కావడంతో అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

News January 19, 2026

ఇండియన్ క్రికెట్‌లో ఏం తప్పు జరుగుతోంది: CV ఆనంద్

image

న్యూజిలాండ్ చేతిలో భారత్ చారిత్రక ఓటమిని ఎదుర్కోవడంపై IPS CV సివి ఆనంద్ చేసిన ఘాటు వ్యాఖ్యలు SMలో వైరల్‌గా మారాయి. ‘ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డు, అపారమైన ప్రతిభ, ఏడాదంతా టోర్నీలు ఉన్నప్పటికీ.. మనం వరుసగా అన్నీ ఓడిపోతున్నాం. అసలు ఇండియన్ క్రికెట్‌లో తప్పెక్కడ జరుగుతోంది? IPL డబ్బు ప్రభావం, ఆటగాళ్లలో టెంపర్మెంట్ తగ్గడం, పూర్ సెలక్షన్, కోచ్ గంభీరే దీనికి కారణమా?’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.