News January 17, 2025
8th పే కమిషన్.. భారీగా పెరగనున్న జీతాలు, పెన్షన్లు!
8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2016లో 7th పే కమిషన్ ఏర్పాటుచేయగా, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. దీంతో బేసిక్ శాలరీ ₹7K నుంచి ₹18Kకు పెరిగింది. ఇప్పుడు 8వ కమిషన్లో ఫిట్మెంట్ 2.86 ఉంటుందని, బేసిక్ జీతం ₹51,480కి పెరుగుతుందని నిపుణుల అంచనా. కనీస పెన్షన్ ₹9K నుంచి ₹20+Kకి పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు.
Similar News
News January 18, 2025
పెళ్లి చేసుకున్న శ్రీలంక క్రికెటర్
శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ ఓ ఇంటివాడయ్యారు. తన ప్రేయసి అర్తికా యోనాలీని వివాహం చేసుకున్నారు. కొలొంబో వేదికగా జరిగిన ఈ వేడుకకు ఆ దేశ క్రికెటర్లు హాజరయ్యారు. IPL-2023, 2024లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన అతను 27 మ్యాచ్లలో 25 వికెట్లు తీశారు. ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్కు ఆడనున్నారు. శ్రీలంక తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 135 వికెట్లు పడగొట్టారు.
News January 18, 2025
పూర్తిగా కోలుకున్న విశాల్
ఇటీవల తీవ్ర అనారోగ్యంతో బాధపడిన హీరో విశాల్ పూర్తిగా కోలుకున్నారు. ‘మదగజరాజు’ సక్సెస్ మీట్లో నవ్వుతూ, ఎంజాయ్ చేస్తూ కనిపించారు. 12 ఏళ్ల తర్వాత విడుదలైన ఈ చిత్రం బ్లాక్బస్టర్ హిట్ సాధించి చరిత్ర సృష్టించిందంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన హీరో విజయ్ ఆంటోనీపై ప్రశంసలు కురిపించారు. సెలబ్రేషన్ ఫొటోలను షేర్ చేశారు.
News January 18, 2025
ఎంపీతో రింకూ ఎంగేజ్మెంట్లో ట్విస్ట్!
రింకూ సింగ్, SP MP ప్రియా సరోజ్ పెళ్లి ప్రచారంపై ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇంకా వారిద్దరికి ఎంగేజ్మెంట్ కాలేదని ప్రియ తండ్రి తుఫానీ సరోజ్ చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. రింకూ ఫ్యామిలీ తమ పెద్ద అల్లుడితో మ్యారేజీ ప్రపోసల్ గురించి చర్చించినట్లు ఆయన చెప్పారని తెలిపింది. తమ 2 కుటుంబాల మధ్య పెళ్లి చర్చలు జరుగుతున్న మాట వాస్తవమే అయినా ఎంగేజ్మెంట్ జరిగిందనడంలో నిజం లేదన్నట్లు వెల్లడించింది.