News November 8, 2024

9న అనంతపురంలో ‘గేమ్ ఛేంజర్’ టీజర్ రిలీజ్

image

‘గేమ్ ఛేంజర్’ సినిమా టీజర్‌ను ఈ నెల 9న సాయంత్రం 4:30 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అనంతపురంలోని త్రివేణి థియేటర్‌లో టీజర్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలిపారు. శంకర్ డైరెక్షన్‌లో రామ్‌చరణ్ నటించిన ఈ మూవీ 2025 జనవరి 10న రిలీజ్ కానుంది. స్టార్ డైరెక్టర్ శంక‌ర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.

Similar News

News December 11, 2024

గార్లదిన్నె మండలంలో బాలికపై అత్యాచారం

image

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో దారుణ ఘటన జరిగింది. బాలికపై వంశీ అనే వ్యాన్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. పదో తరగతి వరకు చదివిన బాలిక పొలం పనులకు వెళ్తోంది. కూలీలను పొలానికి తీసుకెళ్లే డ్రైవర్‌కు బాలికతో పరిచయం ఏర్పడంది. మాయమాటలతో అత్యాచారం చేశాడు. కడుపు నొప్పిగా ఉందని బాలిక పామిడి ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా ఏడు నెలల గర్భిణి అని తేలిసింది. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

News December 11, 2024

విజయవాడకు వెళ్లిన అనంత, సత్యసాయి జిల్లాల కలెక్టర్లు

image

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లు డా.వినోద్ కుమార్, టీఎస్ చేతన్ విజయవాడకు వెళ్లారు. నేడు, రేపు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొంటారు. కూటమి ప్రభుత్వ ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. అలాగే స్వర్ణాంధ్ర విజన్‌-2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు.

News December 11, 2024

సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు చర్యలు: కలెక్టర్

image

సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు మంగళవారం గెజిట్ నోటిఫికేషన్‌ను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ విడుదల చేశారు. సాగునీటి సంఘాలకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. జిల్లాస్థాయిలో మైనర్ ఇరిగేషన్ సంఘాలు 214, మీడియం ఇరిగేషన్ సంఘాలు 16.. మొత్తం 230 ఉన్నాయని తెలిపారు. ఈనెల 14న సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.