News November 8, 2024
9న కర్నూలులో ‘గేమ్ ఛేంజర్’ టీజర్ రిలీజ్

‘గేమ్ ఛేంజర్’ సినిమా టీజర్‌ను ఈనెల 9న సాయంత్రం 4:30 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కర్నూలులోని V MEGA ఆనంద్ సినీ కాంప్లెక్స్‌లో టీజర్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలిపారు. శంకర్ డైరెక్షన్‌లో రామ్‌చరణ్ నటించిన ఈ మూవీ 2025 జనవరి 10న రిలీజ్ కానుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
Similar News
News March 1, 2026
కర్నూలు: మత్తు పదార్థాలపై ఉక్కుపాదం.. కలెక్టర్ ఆదేశం!

కర్నూలు జిల్లాలో మత్తు పదార్థాల రవాణా, వినియోగాన్ని అరికట్టాలని కలెక్టర్ డా.ఏ సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని NCORD సమావేశంలో మాట్లాడుతూ.. విద్యాసంస్థల వద్ద నిఘా పెంచాలని, RTC బస్సుల్లో అక్రమ రవాణా జరగకుండా చూడాలన్నారు. జనవరి నుంచి జిల్లాలో 2 కేసులు నమోదు చేసి 1.350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి సాగుపై నిఘా ఉంచాలని రెవెన్యూ, పోలీసు శాఖలను కలెక్టర్ ఆదేశించారు.
News March 1, 2026
రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం: కర్నూలు SP

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని శనివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లాలో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 27 వరకు ఓవర్ స్పీడ్ (1,536), హెల్మెట్ లేకుండా (1,388), సెల్‌ఫోన్ డ్రైవింగ్ (392), ట్రిపుల్ రైడింగ్ (63) కేసులపై ఈ-చలాన్లు నమోదు చేశారు. అదనంగా 548 డ్రంకెన్ డ్రైవింగ్, 1,107 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేసినట్లు వివరించారు.
News March 1, 2026
పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం కావాలి: కర్నూలు కలెక్టర్

కర్నూలు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి ద్వారా జీడీడీపీ తలసరి ఆదాయం పెంపుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందించాలని అధికారులకు వివరించారు.


