News August 7, 2024
9న తిరుపతిలో జాబ్ మేళా
తిరుపతి SV యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో 9వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. డిక్సన్, మారుతి సుజుకి కంపెనీ ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వాళ్లు అర్హులు. మొత్తం 365 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. వివరాలకు https://forms.gle/aPNi5UoTf8ARRnT6 గూగుల్ పామ్ చూడాలి.
Similar News
News January 12, 2025
చిత్తూరు: ఇద్దరి కూతుళ్లపై తండ్రి అఘాయిత్యం.. అరెస్ట్
నిమ్మనపల్లెలో పిల్లలపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడు వివరాల మేరకు.. నిమ్మనపల్లెకు చెందిన బోయకొండ (28)కు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సుమారు 9ఏళ్ల ఇద్దరు కుమార్తెలతో బోయకొండ అమానుష ఘటనకు పాల్పడడం భార్య చూసింది. ఆమె ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేయగా శనివారం నిమ్మనపల్లెలో అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
News January 12, 2025
కాణిపాకం: స్వామివారి సేవలో ప్రిన్సిపల్ సెక్రటరీ
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని ఎలక్షన్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ చక్రవర్తి కుటుంబ సమేతంగా శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రవీంద్రబాబు, ఆలయ సూపరింటెండెంట్ వాసు పాల్గొన్నారు.
News January 11, 2025
చిత్తూరు: కోడిపందాలు నిర్వహిస్తే చర్యలు
సంక్రాంతి పండగను పురస్కరించుకొని జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, శివార్లు,ఇతర ప్రాంతాల్లో కోడి పందాలు, పేకాట వంటి జూదాలు నిర్వహించడం పూర్తిగా నిషిద్ధమని SP మణికంఠ చందోలు స్పష్టం చేశారు. ఎవరైనా ఈ కార్యకలాపాలకు పాల్పడినా, ప్రోత్సహించినా, సంప్రదాయ క్రీడల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాడ్పడినా, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వీటిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.