News December 6, 2024
9న నన్నయలో బీఈడీ స్పాట్ అడ్మిషన్లు
ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఈనెల 9వ తేదీన బీఈడీ స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని వీసీ ఆచార్య వై.శ్రీనివాసరావు తెలిపారు. బీఈడీ రెండు సంవత్సరాల కోర్సుకు బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ డిగ్రీ పూర్తి చేసి ఎడ్-సెట్ 2024 పరీక్ష రాసిన వారు అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బిసీ విద్యార్థులు 40 శాతం, ఓసీ విద్యార్థులు 50 శాతం మార్కులు డిగ్రీలో పొంది ఉండాలన్నారు.
Similar News
News December 27, 2024
ఈవీఎంలకు పటిష్ట భద్రత: కలెక్టర్
ఈవీఎం, వీవీపాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టర్ కలెక్టరేట్ ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ షణ్మోహన్ రెవిన్యూ, ఎన్నికలు అగ్నిమాపక, పోలీస్ శాఖల అధికారులు, జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈవీఎం గోదాము భద్రతకు చేపడుతున్న చర్యలను పరిశీలించారు.
News December 27, 2024
ఉధారంగా రుణాలు మంజూరు చేయాలి: కలెక్టర్ ప్రశాంతి
జిల్లాలో కౌలు రైతులు, స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరులో బ్యాంకర్లు ఉదారతతో వ్యవహరించాలని తూ.గో. జిల్లా కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో శుక్రవారం బ్యాంకర్లతో సమావేశం జరిగింది. డిసెంబరు 30న నాబార్డు ఆధ్వర్యంలో రొయ్యల రైతుల ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సదస్సు జరుగుతుందన్నారు. త్రైమాసిక ప్రణాళిక, పేదల ఆర్థిక అభ్యున్నతి, వ్యవసాయ అనుబంధ రంగాల రుణాలపై దృష్టి సాధించాలన్నారు.
News December 27, 2024
రేపు కాకినాడకు రానున్న సినీ నటులు
ప్రముఖ సినీ నటుడు, విక్టరీ వెంకటేశ్ శనివారం కాకినాడలో ఓ ప్రైవేట్ ఛానల్ నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలు ఉత్సవంలో పాల్గొననున్నారు. పీఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో జరగనున్న సంక్రాంతి సంబరాల్లో వెంకటేశ్తోపాటు సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, ఆమని, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి పాల్గొననున్నారు. సినీ నటుల రాక కోసం స్థానికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.