News December 6, 2024

9న నన్నయలో బీఈడీ స్పాట్ అడ్మిషన్లు

image

ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఈనెల 9వ తేదీన బీఈడీ స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని వీసీ ఆచార్య వై.శ్రీనివాసరావు తెలిపారు. బీఈడీ రెండు సంవత్సరాల కోర్సుకు బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ డిగ్రీ పూర్తి చేసి ఎడ్-సెట్ 2024 పరీక్ష రాసిన వారు అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బిసీ విద్యార్థులు 40 శాతం, ఓసీ విద్యార్థులు 50 శాతం మార్కులు డిగ్రీలో పొంది ఉండాలన్నారు.

Similar News

News July 6, 2025

పేరెంట్స్ డే నిర్వహణకు సమాయత్వం కావాలి: కలెక్టర్

image

జులై 10న ప్రభుత్వం నిర్వహించే పేరెంట్స్ డే నిర్వహణకు జిల్లా యంత్రాంగం సమాయత్వం కావాలని కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో మెగా పేరెంట్స్ డే, టీచర్స్ మీటింగ్, పి4 సర్వే, అన్నదాత సుఖీభవపై జిల్లా అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు అన్ని యాజమాన్యాల్లో ఉన్న స్కూళ్లలో పేరెంట్స్ డే నిర్వహిస్తామన్నారు. జేసీ కార్యచరణ ప్రణాళిక వివరించారు.

News July 5, 2025

కొవ్వూరు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

కొవ్వూరు రైల్వే స్టేషన్ శివారున గుర్తు తెలియని (35) ఏళ్ల వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని గుర్తించినట్లు రైల్వే ఎస్ఐ పి.అప్పారావు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం 10 గంటల మధ్య సమయంలో రైలు నుంచి జారిపడి మరణించి ఉండొచ్చని ఎస్ఐ తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, వివరాల కోసం 9347237683 నంబర్‌ను సంప్రదించాల్సిందిగా కోరారు.