News March 12, 2025
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో పిలుపు: పార్వతీపురం డీఈవో

9వ తరగతి విద్యార్థులకు ఇస్రో నుంచి పిలుపు వచ్చిందని డీఈఓ ఎన్.తిరుపతి నాయుడు తెలిపారు. యంగ్ సైంటిస్ట్ -2025 పేరిట ఉపగ్రహ ప్రయోగాలను తెలుసుకునేందుకు అవకాశం కల్పించిందన్నారు. ఎనిమిదో తరగతిలో 50 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులన్నారు. దరఖాస్తును ఈ నెల 23వ తేదీలోగా ఆన్లైన్లో నాలుగు దశల్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటివరకు విద్యార్థుల వద్ద నుంచి 40అప్లికేషన్లు వచ్చినట్లు ఆయన తెలిపారు.
Similar News
News March 13, 2025
ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు

TG: ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఈ అథారిటీ ఛైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. దీని పరిధిలో 56 రెవెన్యూ గ్రామాలు, 7 మండలాలు రానున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌కు ధీటుగా దీనిని ప్రభుత్వం ఫోర్త్ సిటీగా అభివర్ణిస్తోంది.
News March 13, 2025
వెంకటాపూర్: Way2Newsకు స్పందన

“రామప్ప ప్రధాన కాలువకు బుంగ ” శీర్షికన ఈనెల 10న <<15710154 >>Way2Newsలో ప్రచురితమైన<<>> కథనానికి ములుగు జిల్లా నీటిపారుల శాఖ అధికారులు స్పందించారు. వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ప్రధాన కాలువ ఐన ఒగరు కాలువ గండిని బుధవారం పూడ్చివేశారు. అనంతరం ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. దీంతో ఆయకట్టు రైతులు Way2Newsకు కృతజ్ఞతలు తెలిపారు.
News March 13, 2025
HNK: ఇనుపరాతి గుట్ట భూములపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం, దేవునూరు గ్రామాల్లో విస్తరించి ఉన్న ఇనుపరాతి గుట్ట పరిధిలో ఫారెస్ట్ అధికారులు గుర్తించిన వ్యవసాయ పట్టాభూములపై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వ్యవసాయ భూముల సర్వే, సంబంధిత రైతుల గుర్తింపు, తదితర వివరాలను సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.