News November 7, 2024

9న నెల్లూరులో ‘గేమ్ ఛేంజర్’ టీజర్ రిలీజ్

image

‘గేమ్ ఛేంజర్’ సినిమా టీజర్‌ను ఈనెల 9న సా.4:30కు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నెల్లూరులోని S2 థియేటర్‌లో టీజర్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలిపారు. శంకర్ డైరెక్షన్‌లో రామ్‌చరణ్ నటించిన ఈ మూవీ 2025 జనవరి 10న రిలీజ్ కానుంది.

Similar News

News February 18, 2026

నెల్లూరు: రిజిస్ట్రార్ బాలాంజనేయులు బదిలీ..!

image

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసఫ్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈయన అల్లూరు సబ్ రిజిస్ట్రార్‌గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన బాధ్యతలు తీసుకునే వరకు ప్రకాశం జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు ఇక్కడ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగనున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో రవి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

News February 18, 2026

నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు బదిలీ..!

image

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసఫ్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈయన అల్లూరు సబ్ రిజిస్ట్రార్‌గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. అప్పటి వరకు ఇక్కడ ప్రకాశం జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు ఇన్‌ఛార్జ్‌గా కొనసాగనున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో రవి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

News February 18, 2026

నెల్లూరు: రంజాన్.. 31 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి.!

image

31 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో రంజాన్ మాసం రావడం విశేషం. నేటి(బుధవారం) రాత్రి చంద్ర దర్శనంతో ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ నెల ప్రారంభమవుతుంది. గురువారం తెల్లవారుజాము నుంచి ముస్లింలు తమ ఉపవాస దీక్షలను ప్రారంభించనున్నారు. ఈ నెలలో సేవలు, దానధర్మాలు చేస్తే పుణ్యకార్యంగా భావిస్తారు. మార్చి 19 లేదా 20 తేదిలలో ఉపవాస దీక్షలు ముగుస్తాయి. ఆరోజు ఈద్ ఉల్ ఫితర్‌ను చేసుకోనున్నారు.