News January 4, 2026
9న పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 9న నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరి, 10:30కు హెలికాప్టర్ ద్వారా పిఠాపురం చేరుకుంటారు. అక్కడ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని, మధ్యాహ్నం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం కాకినాడలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 5:30కు తిరిగి తిరుగు ప్రయాణమవుతారని అధికారులు వెల్లడించారు.
Similar News
News January 6, 2026
VZM: డీలర్ల సమస్యలపై మంత్రి నాదెండ్లకు వినతి

రాష్ట్ర పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం విజయనగరం జిల్లాను పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా డీలర్ల సంఘం అధ్యక్షుడు చొక్కాపు రామారావు డీలర్ల సమస్యల పరిష్కారానికి వినతి పత్రం అందజేశారు. క్వింటాకు రూ.300 కమిషన్ ఇవ్వాలి, నిత్యావసర వస్తువుల అమ్మకాలకు అనుమతి, 60 సంవత్సరాలు దాటిన డీలర్లకు పెన్షన్, రుణ మాఫీ వంటి ప్రధాన అంశాలను వివరించారు. మంత్రి వినతిని స్వీకరించి సానుకూలంగా స్పందించారు.
News January 6, 2026
‘రాజాసాబ్’ రన్ టైమ్ ఫిక్స్.. టికెట్ ధరలు పెరిగేనా?

ప్రభాస్, మారుతి కాంబినేషన్లో రూపొందిన ‘రాజాసాబ్’ మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా నిడివి 3 గంటల 9 నిమిషాలుగా పేర్కొంది. మరోవైపు సెన్సార్ సర్టిఫికెట్ రావడంతో టికెట్ ధరల పెంపునకు అనుమతివ్వాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు నిర్మాణ సంస్థ లేఖ రాసింది. దీనిపై <<18543073>>TG ప్రభుత్వం<<>> ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 9న మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.
News January 6, 2026
ఆన్‌లైన్‌లో కుల ధ్రువీకరణ పత్రాల నిక్షిప్తం: కలెక్టర్

ప్రజలకు కుల ధ్రువీకరణ పత్రాల జారీలో ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 3,94,172 మంది వివరాలను సుమోటోగా విచారించి ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేసినట్లు తెలిపారు. వీటిలో 3,25,834 మంది పత్రాల విచారణ పూర్తవగానే ఆమోదముద్ర వేశామన్నారు. భవిష్యత్తులో ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు.


