News October 30, 2024

9 నుంచి యూరప్‌లో శ్రీనివాస కళ్యాణాలు

image

టీటీడీ ఆధ్వర్యంలో ఈ ఏడాది నవంబర్, డిసెంబర్‌లో యూకే, ఐర్లాండ్, యూరప్‌లోని 8 దేశాల్లోని 13 నగరాల్లో శ్రీనివాస కళ్యాణాలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ నిర్వాహకులు సూర్య ప్రకాశ్, కృష్ణ జవాజీ తదితరులు టీటీడీ ఈవో శ్యామలరావును తిరుపతిలోని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో మంగళవారం కలిశారు. శ్రీనివాస కళ్యాణాల్లో పాల్గొనాలని ఈవోను ఆహ్వానించారు.

Similar News

News February 24, 2026

చిత్తూరు- తిరుపతి హైవేపై ప్రమాదం

image

పూతలపట్టు మండలం వడ్డేపల్లి వద్ద ఓ వ్యక్తిని టెంపో వాహనం ఢీకొట్టింది. స్థానిక బిడారమిట్టకు చెందిన టి చెంగయ్య వడ్డేపల్లి వద్ద ఓ కళ్యాణమండపంలో జరుగుతున్న తమ సమీప బంధువు వివాహానికి హాజరు కావడానికి వెళ్లాడు. ఈ క్రమంలో బస్సు దిగి రోడ్డు దాటుతుండగా టెంపో వాహనం చెంగయ్యను ఢీకొని రెండు కాళ్లపై మీదుగా వెళ్లింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 24, 2026

సదుం: అవకతవకలకు పాల్పడ్డ BPM సస్పెండ్

image

సదుం మండలం చెరుకువారిపల్లి బ్రాంచ్ తపాలయ కార్యాలయంలో ఓ ఉద్యోగి పలువురి ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాతాదారుల పాసుపుస్తకాలను పుంగనూరు డివిజనల్ ఇన్‌స్పెక్టర్ మోహన్ పరిశీలించారు. అవకతవకలు జరిగినట్లు నిర్ధారించి BPM ధనలక్ష్మిని సస్పెండ్ చేశారు. మొత్తం ఖాతాలను పరిశీలించేందుకు కొద్ది రోజుల సమయం పడుతుందన్నారు.