News October 30, 2024
9 నుంచి యూరప్‌లో శ్రీనివాస కళ్యాణాలు
టీటీడీ ఆధ్వర్యంలో ఈ ఏడాది నవంబర్, డిసెంబర్‌లో యూకే, ఐర్లాండ్, యూరప్‌లోని 8 దేశాల్లోని 13 నగరాల్లో శ్రీనివాస కళ్యాణాలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ నిర్వాహకులు సూర్య ప్రకాశ్, కృష్ణ జవాజీ తదితరులు టీటీడీ ఈవో శ్యామలరావును తిరుపతిలోని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో మంగళవారం కలిశారు. శ్రీనివాస కళ్యాణాల్లో పాల్గొనాలని ఈవోను ఆహ్వానించారు.
Similar News
News November 6, 2024
కుప్పం : ఓడిన అభ్యర్థి పుట్టినరోజు నాడే గెలిచిన అభ్యర్థి రాజీనామా
టీడీపీ కుప్పం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన త్రిలోక్ పుట్టినరోజు నాడే మున్సిపల్ ఛైర్మన్‌గా గెలుపొందిన డా.సుధీర్ రాజీనామా చేయడం స్థానికంగా చర్చనీయంగా మారింది. వ్యక్తిగత కారణాల నేపథ్యంలో డా.సుధీర్ వైసీపీతో పాటు మున్సిపల్ ఛైర్మన్ , కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. మున్సిపల్ చైర్ పర్సన్‌గా త్రిలోక్ సతీమణి భాగ్యలక్ష్మికి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
News November 6, 2024
పుత్తూరు: సివిల్ సప్లై డీటీ విష్ణు అరెస్ట్
రేషన్ బియ్యం అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకున్న సివిల్ సప్లై గోడౌన్ CSDT విష్ణును పుత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం పుత్తూరు కోర్టులో హాజరు పరచగా కోర్టు 14 రోజులు పాటు రిమాండ్ విధించింది. CI సురేంద్ర నాయుడు మాట్లాడుతూ.. 2022 DEC నుంచి 2024 AUG వరకు పుత్తూరు స్టాక్ గోడౌన్ CSDTగా వ్యవహరిస్తూ 5040 బస్తాలు అమ్మి రూ.29.70 లక్షల సొమ్ము చేసుకొని రూ.17 లక్షలు అప్పులు చెల్లించినట్లు తెలిపారు.
News November 6, 2024
నాణ్యతతో కూడిన వైద్య సేవలు అందించాలి: తిరుపతి కలెక్టర్
జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో నాణ్యతతో కూడిన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో రూయా, స్విమ్స్, బర్డ్, మెటర్నిటీ, అశ్విని ఆస్పత్రుల సూపరింటెండెంట్ లతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డా.శ్రీహరి, DCHS. ఆనందమూర్తి, రుయా, స్విమ్స్,ESI, అరవింద్ ఐ హాస్పిటల్, మెటర్నిటీ ఆసుపత్రి అధికారులు పాల్గొన్నారు.