News January 25, 2025
9 మంది ఏఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతి
అనంతపురం జిల్లాకు చెందిన 9 మంది ఏఎస్సైలు ఎస్సైలుగా పదోన్నతులు పొందారు. ఈ సందర్భంగా పదోన్నతులు పొందిన ఎస్సైలు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పదోన్నతులు రావడం అభినందనీయమని, మిగిలిన సర్వీసును కూడా రిమార్కు లేకుండా పూర్తి చేయాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో మరిన్న పదోన్నతులు పొందాలని ఆకాంక్షించారు. కాగా వీరందరూ 1991 బ్యాచ్‌కు చెందిన వారు.
Similar News
News February 5, 2025
బాస్కెట్ బాల్ ఛాంపియన్‌షిప్‌నకు ఈ నెల 6న క్రీడాకారుల ఎంపిక
కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు 8వ ఏపీ యూత్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తున్నారు. బుధవారం అనంతపురంలో జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.శ్రీకాంత్ రెడ్డి, సెక్రటరీ కే.నరేంద్ర చౌదరి మాట్లాడారు. ఛాంపియన్ షిప్‌నకు స్థానిక అశోక్ నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 6న 8 గంటలకు బాలురు, బాలికల టీమ్‌లను ఎంపిక చేస్తామని తెలిపారు.
News February 5, 2025
అనంత: ఆటో డ్రైవర్‌పై హిజ్రాల దాడి.. వివరణ
అనంతపురం సమీపంలోని బుక్కరాయసముద్రం మండల కేంద్రం చెరువు కట్ట వద్ద ఇటీవల ఓ ఆటో డ్రైవర్‌పై హిజ్రాలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై హిజ్రాలు వివరణ ఇచ్చారు. తమ ఆత్మ రక్షణ కోసమే అలా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తమ వల్ల ఎవరికీ హాని జరగదని అన్నారు. బీ.సముద్రం పోలీసులు మాట్లాడుతూ.. హిజ్రాలు ఇబ్బందులు కలిగిస్తే తమకు తెలపాలన్నారు. తప్పు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
News February 5, 2025
నేడు అనంతపురంలో హార్టికల్చర్ కాంక్లేవ్
అనంతపురంలోని MYR ఫంక్షన్ హాలులో ఇవాళ ఉదయం 9 గంటలకు హార్టికల్చర్ కాంక్లేవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వినోద్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కాంక్లేవ్ సమావేశంలో హార్టికల్చర్ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్‌లతో పాటు 16 మంది దేశ, విదేశాలకు చెందిన కార్పొరేట్ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాతో 6 MOUలు కురుర్చుకోనున్నారు.