News April 2, 2025

97 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం

image

ఫిబ్రవరిలో నిబంధనలు ఉల్లంఘించిన 97 లక్షల ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. వీటిలో 14 లక్షల ఖాతాలపై ఫిర్యాదు రాకముందే చర్యలు తీసుకుంది. తప్పుదోవ పట్టించే అకౌంట్లను ఏఐ సాంకేతికత ద్వారా గుర్తించింది. యూజర్ల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని వాట్సాప్ పేర్కొంది. స్పామ్ మెసేజ్‌లు పంపడం, నకిలీ అకౌంట్లు, థర్డ్ పార్టీ యాప్స్ వాడటం, తప్పుడు సమాచార వ్యాప్తి వంటి కారణాలతో అకౌంట్లను బ్యాన్ చేస్తోంది.

Similar News

News February 4, 2026

అదరగొట్టిన ఇషాన్.. ఏకంగా 32 స్థానాలు ఎగబాకి

image

టీమ్ ఇండియా యంగ్‌స్టర్ ఇషాన్ కిషన్ ఐసీసీ T20I ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపారు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సీరీస్‌లో అదరగొట్టడంతో ఏకంగా 32 స్థానాలు ఎగబాకి 32వ ప్లేస్‌కి చేరుకున్నారు. టీ20 వరల్డ్ కప్ ప్లేయింగ్-11లో ఇషాన్ చోటు దక్కించుకుంటే రెండు వారాల్లోనే టాప్-10కు చేరుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అభిషేక్ శర్మ(917 పాయింట్లు) టాప్ బ్యాటర్‌గా కొనసాగుతున్నారు.

News February 4, 2026

కిచెన్ గార్డెనింగ్ ఇలా ఈజీ

image

కిచెన్ గార్డెనింగ్ చేయాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. కిచెన్ ప్లాంట్స్‌కి 3-6 గంటల సూర్యరశ్మి అవసరం. వీటిని బాటిల్స్, గ్లాస్ కంటైనర్స్‌లో పెంచొచ్చు. సారవంతమైన మట్టి, మంచి విత్తనాలు వాడాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఆకుకూరలు, టొమాటో, మిర్చి, అల్లం, బంగాళదుంప ఈజీగా పెరుగుతాయి. సరిపడా నీరే పోయాలి. కుండీలకు రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకూ రసాయనాలు, పురుగుమందులు వాడకూడదు.

News February 4, 2026

బత్తాయిలో తొడిమ కుళ్లు తెగులును ఎలా నివారించాలి?

image

తొడిమ కుళ్లు సోకి, రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. తెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా కార్బండిజం 1 గ్రాము కలిపి పిచికారీ చేయాలి. ప్రతి సంవత్సరం తొలకరిలో చెట్లలో ఎండుపుల్లలను కత్తిరించి నాశనం చేయాలి. శిలీంధ్రానికి ఆశ్రయమిచ్చే కలుపు మొక్కలను సమర్థవంతంగా అరికట్టేందుకు చెట్ల పాదుల్లో మల్చింగ్ పద్ధతిని అవలంబించాలి. తోటల్లో నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.