News June 7, 2024
జైల్లో చదువుకోవడానికి 9 పుస్తకాలు కావాలి.. కోర్టును కోరిన MLC కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కవితకు మరో షాక్ తగిలింది. సీబీఐ ఛార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు.. కవితకు ఈ నెల 21 వరకు జుడీషియల్ కస్టడీని పొడిగించింది. జైల్లో చదువుకోవడానికి కవిత 9 పుస్తకాలు కోరగా ఆ విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది.
Similar News
News October 30, 2025
బాహుబలి టికెట్ల పేరుతో మోసాలు.. జాగ్రత్త!!

కొత్త సినిమా టికెట్లు ఉన్నాయంటూ SMలో కొందరు మోసాలు చేస్తున్నారు. తాజాగా ‘బాహుబలి ది ఎపిక్’ సినిమా ప్రీమియర్ టికెట్లు ఉన్నాయని, కావాలంటే మెసేజ్ చేయాలని ఓ వ్యక్తి(Heisenberg M) ట్వీట్ చేశాడు. ఇది నమ్మి డబ్బులు పంపి మోసపోయామని నెటిజన్లు చెబుతున్నారు. ఆ ఖిలాడి చెప్పిన 9391872952 నంబర్కు డబ్బులు పంపిన తర్వాత బ్లాక్ చేస్తున్నట్లు వాపోతున్నారు. పోలీసులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News October 30, 2025
గాయంపై స్పందించిన శ్రేయస్ అయ్యర్

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో <<18117184>>తీవ్రంగా<<>> గాయపడటంపై టీమ్ ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తొలిసారి స్పందించారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇలాంటి సమయంలో అభిమానులు మద్దతుగా నిలవడంపై సంతోషం వ్యక్తం చేశారు. అందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఆసీస్తో చివరి వన్డేలో క్యాచ్ పడుతూ శ్రేయస్ గాయపడ్డారు. దీంతో అతడికి ఐసీయూలో చికిత్స అందించారు.
News October 30, 2025
వంటింటి చిట్కాలు

* బత్తాయి, నారింజ పండ్లను మైక్రోఓవెన్లో కొన్ని సెకన్ల పాటు ఉంచితే తొక్క సులభంగా వస్తుంది.
* కాకరకాయ కూరలో సోంపు గింజలు లేదా బెల్లం వేస్తే కూర చేదు తగ్గుతుంది.
* అరటిపండ్లను ప్లాస్టిక్ డబ్బాలో వేసి ఫ్రిజ్లో పెడితే నల్లగా మారవు.
* ఐస్ క్యూబ్స్ వేసిన నీళ్లలో ఉడికించిన బంగాళదుంపలు వేసి, తర్వాత తొక్కలు తీస్తే సులువుగా వస్తాయి.
* పోపు గింజలు వేయించి నిల్వ చేస్తే పాడవకుండా ఉంటాయి.


