News August 4, 2024
ఆలయం గోడ కూలి 9 మంది చిన్నారులు మృతి

భారీ వర్షాలకు ఆలయం గోడ కూలి 9 మంది పిల్లలు మరణించిన విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని షాపూర్లో జరిగింది. స్థానిక హర్దౌల్ బాబా ఆలయంలో జరుగుతున్న సావన్ వేడుకలను తిలకించేందుకు భారీగా భక్తులు వెళ్లారు. ఈక్రమంలోనే వర్షాలకు తడిసిన టెంపుల్ గోడ అక్కడ కూర్చున్న పిల్లలపై పడింది. దీంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరంతా 14 ఏళ్లలోపు వారే. గాయపడ్డ మరికొందరిని ఆసుపత్రికి తరలించారు.
Similar News
News March 21, 2026
సహజత్వానికి భంగం కలగకుండా భద్రాచలం ఆలయ అభివృద్ధి: CM

TG: భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధిపై CM రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఆలయ సహజత్వానికి భంగం కలగకుండా పూర్తిగా ఆగమశాస్త్రానుసారం అభివృద్ధి పనులు నిర్వహించాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా మూడు దశల్లో పనులను పూర్తి చేయాలన్నారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి చేయగలిగిన పనులను ముందుగా గుర్తించి 2027 మార్చి 31 నాటికి పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని ఆదేశించారు.
News March 21, 2026
IPLలో గ్రేటెస్ట్ టీమ్ ఇదే: పఠాన్

IPLలో ముంబై ఇండియన్స్ గ్రేటెస్ట్ టీమ్ అని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. ‘ముంబై, చెన్నైలలో ఏదైనా ఒకటి ఎంచుకోవాలంటే కష్టమే. చెన్నై 2010లో, ముంబై 2013లో తొలిసారి టైటిల్స్ సాధించాయి. ఇరు జట్లు 5 సార్లు ఛాంపియన్లుగా నిలిచాయి. కానీ టీమ్ ఇండియాకు మ్యాచ్ విన్నర్లను అందించడంలో ముంబై ముందు వరుసలో ఉంది. అందులో నలుగురు టీమ్ ఇండియా కెప్టెన్లు ఉన్నారు. అందుకే ముంబై అంటే నాకు గౌరవం’ అని తెలిపారు.
News March 21, 2026
గ్రీన్ 2 ఓవర్లే వేస్తే రూ.2 కోట్లు కట్ చేయాలి: అశ్విన్

KKR ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌పై మాజీ క్రికెటర్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన 2 ఓవర్లే బౌలింగ్ వేస్తే ఫీజు నుంచి రూ.2 కోట్లు కట్ చేయాలి. 4 ఓవర్ల కోటా పూర్తి చేయకపోతే డబ్బును తగ్గించే హక్కు IPL ఫ్రాంచైజీలకు ఉండాలి’ అని అభిప్రాయపడ్డారు. IPLలో గ్రీన్ 4 ఓవర్లు వేయడానికి AUS అనుమతిస్తుందా? అనేది వేచి చూడాలన్నారు. కాగా గాయాలు కాకుండా ఉండేందుకు గ్రీన్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా పరిమితులు విధించింది.


