News October 8, 2025
రైట్స్‌లో 9 ఇంజినీరింగ్ పోస్టులు

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(రైట్స్) 9 ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, బీఈ, బీటెక్/ఎంఈ, ఎంటెక్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం గల అభ్యర్థులు ఈనెల 16వరకు అప్లై చేసుకోవచ్చు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి నేటి నుంచి ఈనెల 17వరకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వీటిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. వెబ్‌సైట్: https://rites.com/
Similar News
News March 20, 2026
‘కబంధ హస్తాలు’ అంటే ఏమిటి?

దయలేని బలవంతుడైన వ్యక్తి అధీనంలో ఎవరైనా చిక్కుకుపోయినప్పుడు ‘కబంధ హస్తాలు’ జాతీయాన్ని వాడతారు. ఇది రామాయణం నుంచి వచ్చింది. ఇంద్రుడి శాపంతో కబంధుడు అనే రాక్షసుడికి మొండెం, చేతులు మాత్రమే ఉంటాయి. అతడు ఎక్కడికీ వెళ్లలేకపోయినా చేతులు ఎంత దూరమైనా వెళ్తాయి. అందులో చిక్కితే మరణమే. వనవాసంలో రామలక్ష్మణులను ఇలాగే బంధించగా వారు అతని చేతులను నరికేసి శాప విమోచనం కలిగిస్తారు.
<<-se>>#EPICSAYINGS<<>>
News March 20, 2026
133 ఏళ్ల రైల్వే బ్రిడ్జికి గుడ్‌బై

AP: విజయవాడలోని కృష్ణా నదిపై 1893 మార్చి 17న ప్రారంభించిన తొలి మీటర్ గేజ్ రైల్వే బ్రిడ్జికి 133 ఏళ్లు నిండాయి. ఇది 1989 వరకు సేవలందించింది. దీని స్థానంలో డబుల్ లైన్ బ్రిడ్జిని నిర్మించేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. విజయవాడ-గూడూరు మార్గంలోని పిల్లర్లను హైడ్రాలిక్ క్రేన్ల సాయంతో పగులగొట్టేందుకు ప్రయత్నిస్తున్నా సాధ్యం కావట్లేదు. దీంతో వాటిని లిమిటెడ్ బ్లాస్టింగ్ చేయాలని అధికారులు యోచిస్తున్నారు.
News March 20, 2026
‘ధురంధర్-2’తో ఆ డైరెక్టర్లు బెదిరిపోతారు: RGV

‘ధురంధర్-2’పై మరోసారి ప్రశంసలు కురిపించిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రొటీన్ సినిమాలు తీసే దర్శకులపై ఫైర్ అయ్యారు. హీరోలను దేవుడిలా కొలుస్తూ ఫిజిక్స్, గ్రావిటీతో సంబంధం లేని చిత్రాలు తీసే డైరెక్టర్లకు ఇది వణుకుపుట్టిస్తుందన్నారు. దీంతో అసలైన హీరోయిజం పుట్టిందని.. ఇప్పుడు రొటీన్ స్టార్ హీరోలంతా జోకర్లుగా కనిపిస్తున్నారని విమర్శించారు. రొటీన్ యాక్షన్ మూవీలను ఇకపై ఆడియన్స్ చూడరని ట్వీట్ చేశారు.


