News April 30, 2024

వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తా: చంద్రబాబు

image

AP: తాము అధికారంలోకి రాగానే వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. దెందులూరు సభలో మాట్లాడుతూ.. ‘పశువులు, దాణా, మందుల కొనుగోళ్లపై సబ్సిడీ ఇస్తాం. గోపాలమిత్రలను మళ్లీ నియమిస్తాం’ అని తెలిపారు. అలాగే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకూ పథకాలు అమలు చేస్తామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు అంగన్‌వాడీలకు గ్రాట్యుటీ, ఆశావర్కర్లకు కనీస వేతనం పెంచుతామని చెప్పారు.

Similar News

News March 10, 2026

యుద్ధ భయం.. భారీగా పెరిగిన విమాన టికెట్ రేట్లు

image

మిడిల్ ఈస్ట్ దేశాల్లో కొనసాగుతోన్న సంక్షోభాన్ని విమానయాన సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. దుబాయ్ నుంచి ముంబైకి నడిచే నాన్ స్టాప్ ఫ్లైట్‌లలో టికెట్ రేట్లను మార్చి 10-15 మధ్య ఏకంగా రూ.45-65వేలకు(సాధారణంగా రూ.10-20వేలు) పెంచాయి. ఇతర ప్రధాన నగరాలకూ ఇదే తరహా రేట్లు ఉన్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎమిరేట్స్, ఎయిర్ అరేబియా ఒకదానికొకటి పోటీ పడి వసూలు చేస్తున్నాయి.

News March 10, 2026

వేలాది కోళ్లు మృతి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

image

TGలోని నాగర్‌కర్నూల్(D)లో అంతుచిక్కని కారణంతో వేలాది కోళ్లు మృతి చెందాయనే సమాచారంతో AP ప్రభుత్వం అప్రమత్తమైంది. అనుమతి లేకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కోళ్లు, గుడ్లను తీసుకురావొద్దని వ్యాపారులను ఆదేశించింది. సరిహద్దుల్లోని కోళ్ల ఫారాలపై నిఘా ఉంచాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు సూచించింది. చనిపోయిన కోళ్లను పూడ్చేయాలని తెలిపింది. అలాగే కోడి మాంసం, గుడ్లను బాగా ఉడకబెట్టి తినాలని ప్రజలకు సూచించింది.

News March 10, 2026

సల్మాన్ మూవీలో హీరోయిన్‌గా సమంత?

image

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కబోయే సూపర్ హీరో ఫిల్మ్‌లో సమంత హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. రాజ్&డీకే ద్వయం ఈ మూవీని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో హ్యూమర్+యాక్షన్ ఉంటుందని సమాచారం. కాగా డైరెక్టర్ల ద్వయంలో ఒకరైన రాజ్‌‌ను సామ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ‘మా ఇంటి బంగారం’ సినిమాతో పాటు ‘రక్త బ్రహ్మాండ్’ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు.