News November 25, 2024
మార్చి నాటికి 9 MLC స్థానాలు ఖాళీ

TG: రాష్ట్రంలో 9 MLC స్థానాలు ఖాళీ కానున్నాయి. కాంగ్రెస్, BRS పార్టీల నుంచి 3, ఇండిపెండెంట్లు 2, MIM నుంచి 1 స్థానం మార్చి నాటికి ఖాళీ కానుండటంతో ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మండలిలో ఇప్పటి వరకూ BRSదే మెజార్టీ ఉండగా.. ఖాళీ స్థానాలన్నింటినీ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. యువ నేతలకు ప్రాధాన్యం ఇచ్చే ఆలోచనలో పార్టీ అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News October 16, 2025
48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు: ఉత్తమ్

TG: ఖరీఫ్ సీజన్లో 8,342 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని చెప్పారు. అలాగే సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తామన్నారు. కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలతో పాటు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
* అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News October 16, 2025
రబీ మొక్కజొన్న సాగుకు అనువైన రకాలు

రబీ మొక్కజొన్నను OCT-15 నుంచి NOV-15 వరకు విత్తుకోవచ్చు. మొక్కజొన్నలో కాలపరిమితిని బట్టి దీర్ఘకాలిక(100-120), మధ్యకాలిక(90-100), స్వల్పకాలిక( 90 రోజుల కంటే తక్కువ) రకాలున్నాయి. రబీ మొక్కజొన్న సాగుకు అనువైన రకాలు D.H.M.111, D.H.M.115, D.H.M.117, D.H.M.121.
☛ హైబ్రిడ్ రకాలు: DHM-103, DHM-105, DHM-107, DHM-109
☛ కాంపోజిట్ రకాలు: అశ్విని, హర్ష, వరుణ్, అంబర్ పాప్కార్న్, మాధురి, ప్రియా స్వీట్కార్న్
News October 16, 2025
భూ రక్షకుడు ఆ వేంకటేశుడే..

వేంకటాచల మాహాత్మ్యం ప్రకారం.. పూర్వం లోకం అంతమయ్యే సమయంలో సూర్యుడు రుద్రమూర్తి రూపంలో భూమిని మండించాడు. దీంతో చాలా ఏళ్లు వర్షాలు లేక భూమి ఎండిపోయింది. అడవులు, పర్వతాలు బూడిదయ్యాయి. ఆ తర్వాత భయంకర గాలి వీచి, భారీ వర్షాలు కురిసి, జలప్రళయం వచ్చింది. భూమి మొత్తం నీట మునిగింది. అప్పుడు హరి శ్వేత వరాహ రూపంతో సంద్రంలోకి ప్రవేశించి, పాతాళం వరకు వెళ్లి, మునిగిపోయిన భూమిని పైకి తీసుకొచ్చారు.<<-se>>#VINAROBHAGYAMU<<>>