News August 4, 2025
కల్లు తాగి 9 మంది మృతి.. SHO సస్పెండ్

TG: హైదరాబాద్‌లో కల్తీ కల్లు తాగి 9 మంది <<17032543>>ప్రాణాలు <<>>కోల్పోయిన ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాలానగర్ ఎక్సైజ్ SHO వేణుకుమార్‌ను సస్పెండ్ చేసింది. DTF నర్సిరెడ్డి, ఏఈఎస్ మాధవయ్య సహా మిగతా వారి పాత్రపై దర్యాప్తు చేస్తోంది. తనిఖీలు చేయకుండా, కల్తీ కల్లు తయారవుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారని వేణుపై వేటు వేసింది. అటు పదుల సంఖ్యలో బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Similar News
News August 16, 2025
పరిశ్రమలకు ఉచితంగా భూములు: నితీశ్

బిహార్‌లో పరిశ్రమలు నెలకొల్పే ప్రైవేటు కంపెనీలకు CM నితీశ్ కుమార్ ప్రత్యేక ఎకనామిక్ ప్యాకేజ్ ప్రకటించారు. ‘క్యాపిటల్ సబ్సిడీ, ఇంట్రెస్ట్ సబ్సిడీ, రెట్టింపు GST ప్రోత్సాహకాలు, ఏ జిల్లాలోనైనా భూమి ఇస్తాం. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలకు భూమి ఫ్రీగా ఇస్తాం. నెక్ట్స్ 6 నెలల్లో పరిశ్రమలు నెలకొల్పే వారికి ఇవన్నీ వర్తిస్తాయి. బిహార్ యువత భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ట్వీట్ చేశారు.
News August 16, 2025
ఒప్పందం చేసుకోమని జెలెన్‌స్కీకి చెప్తా: ట్రంప్

అలాస్కాలో అమెరికా, రష్యా అధ్యక్షుల సమావేశం ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిసింది. ‘రష్యాతో ఒప్పందం చేసుకోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి సూచిస్తాను. కానీ, వాళ్లు అందుకు నిరాకరించే అవకాశమే ఎక్కువుంది. పుతిన్-జెలెన్‌స్కీల సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నాను. జరిగితే ఆ భేటీలో నేను కూడా ఉండే అవకాశం ఉంది’ అని తెలిపారు. పుతిన్‌తో ఏయే అంశాలపై చర్చించారు అనే విషయాన్ని మాత్రం ట్రంప్ వెల్లడించలేదు.
News August 16, 2025
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ కన్నుమూత

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ బాబ్ సిమ్సన్(89) కన్నుమూశారు. 1957 నుంచి 1978 వరకు 68 టెస్టులు ఆడిన ఆయన 4,869 రన్స్ చేశారు. 71 వికెట్లు పడగొట్టారు. అయితే 1968లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సిమ్సన్ 1977లో 41 ఏళ్ల వయసులో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. కానీ మరుసటి ఏడాదే రిటైర్ అయ్యారు. తర్వాత ఆస్ట్రేలియా కోచ్‌గా మారారు. ఆయన కోచింగ్‌లోనే AUS 1987 WC, యాషెస్ సిరీస్ గెలిచింది.