News December 5, 2024

పుష్ప-2కి 90% BGM నాదే: సామ్ CS

image

‘పుష్ప-2’ సినిమాకు దాదాపు 90% <<14713017>>బ్యాక్ గ్రౌండ్ స్కోర్<<>> తానే ఇచ్చినట్లు మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ వెల్లడించారు. ‘నేను స్క్రిప్ట్ చదవకుండా BGM ఇచ్చిన మూవీ ఇదొక్కటే. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఎడిటింగ్ అయిపోగానే నన్ను సంప్రదించారు. మొత్తం సినిమాకు పనిచేశాను. కొన్ని చోట్ల DSP ఇచ్చిన BGM అలాగే ఉంచారు. క్లైమాక్స్ ఫైట్‌లో వచ్చే BGM కూడా నాదే’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Similar News

News February 5, 2025

ఢిల్లీలో కాంగ్రెస్‌కు శూన్య హస్తమేనా?

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మెజారిటీ సంస్థలు BJPకి, మరికొన్ని ఆప్‌కు అధికారం దక్కుతుందని తెలిపాయి. కాగా, దాదాపు అన్ని సర్వేల్లోనూ కాంగ్రెస్‌ ఖాతా తెరవదని చెప్పాయి. 0-3 సీట్లకే ఛాన్స్ ఉందని ఒకట్రెండు తెలిపాయి. దీంతో ఢిల్లీలో కాంగ్రెస్ పని ఖతమైనట్లే అని, ఆప్‌తో పొత్తు పెట్టుకోవాల్సిందని రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు.

News February 5, 2025

రేపు జగన్ ప్రెస్‌మీట్

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడతారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, ప్రజా సమస్యలపై ఆయన ప్రసంగిస్తారు. కాగా ఇవాళ విజయవాడ కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో జగన్ కూటమి సర్కార్‌పై ఫైర్ అయ్యారు. ఈసారి జగనన్న 2.0 వేరే లెవెల్‌లో ఉంటుందని కూటమి సర్కార్‌ను ఆయన హెచ్చరించారు.

News February 5, 2025

పీవోకేలో అడుగుపెట్టిన హమాస్!

image

కశ్మీర్ సాలిడారిటీ డేలో పాల్గొనేందుకు పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు హమాస్ లీడర్ ఖలీద్ అల్ ఖదౌమీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్‌లో జైషే (Jaish-e – జైషే) మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు తల్హా సైఫ్‌తో కలిసి ఖలీద్ పాల్గొన్నట్లు సమాచారం. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైలెవెల్ మీటింగ్ నిర్వహించారు. భద్రతా చర్యలు తీవ్రతరం చేయాలని ఆ రాష్ట్ర పోలీసులను ఆదేశించారు.

error: Content is protected !!