News October 28, 2024
90% నకిలీ బాంబు బెదిరింపులు యూకే నుంచే!

విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులపై దర్యాప్తు సంస్థలకు మొదటి లీడ్ లభించినట్టుగా తెలుస్తోంది. గత రెండు వారాల్లో వచ్చిన 400లకు పైగా నకిలీ బెదిరింపుల్లో 90% వరకు యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు VPN, డార్క్ వెబ్ అడ్రస్‌ల ద్వారా కౌంటర్ టెర్రరిజమ్ డివిజన్ గుర్తించగలిగినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంలో NIA కూడా దర్యాప్తు చేస్తోంది.
Similar News
News February 8, 2026
జూన్ 2న కవిత కొత్త పార్టీ ఆవిర్భావం

BRS నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ MLC కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న పార్టీ పేరు, జెండా, అజెండాను లాంఛనంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే తెలంగాణ జాగృతి బృందం భారత ఎన్నికల సంఘాన్ని కలిసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను ప్రారంభించింది. పార్టీ నిర్మాణంపై కసరత్తు ముమ్మరం చేసిన కవిత కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.
News February 8, 2026
రేవంత్ అత్యంత దరిద్రపు సీఎం: KTR

TG: చరిత్రలో బూతులు మాట్లాడే ఏకైక CMగా రేవంత్ రెడ్డి మిగిలిపోతారని, ఆయన అత్యంత దరిద్రపు ముఖ్యమంత్రి అని కేటీఆర్ విమర్శించారు. రెండేళ్లుగా KCRను తిట్టడం తప్పించి చేసిందేమీ లేదన్నారు. రోజూ రూ.వందల కోట్లు దోచుకోవడమే ఏకైక అజెండాగా పెట్టుకున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాకుంటే కాంగ్రెస్ వాళ్లు మరో మూడేళ్ల దాకా దొరకరని, వారికి బుద్ధి చెప్పాలని తాండూరు సభలో పిలుపునిచ్చారు.
News February 8, 2026
అరటిలో దుంపకుళ్లు తెగులు నివారణ ఎలా?

అరటి పంటలో దుంపకుళ్లు తెగులును నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ఆశిస్తే తోటలకు సరిపడా నీరివ్వాలి. తెగులు సోకిన మొక్కలను దుంపలతో సహా తీసేసి తోట బయట చిన్న చిన్న ముక్కలుగా చేసి తగలబెట్టాలి. మొక్కల మొదళ్ల దగ్గర మట్టి బాగా తడిచేలా 25 గ్రాముల బ్లీచింగ్ పౌడర్‌ను లీటరు నీటికి కలిపి తడపాలి. పశువుల ఎరువుతో వృద్ధి చేసిన సూడోమోనాస్‌ను మొక్కల మొదళ్ల దగ్గర వేస్తే తెగులు చాలా వరకు తగ్గుతుంది.


