News March 11, 2025
త్వరలో 900 అంగన్వాడీలు ప్రారంభం: మంత్రి సంధ్యారాణి

AP: రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రెండుమూడు నెలల్లో 900 అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభించనున్నట్లు మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అంగన్వాడీల్లో తాగునీరు, టాయిలెట్స్ కోసం రూ.7 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అలాగే గిరిజనుల కోసం 18 రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తామని బడ్జెట్ ఆమోదం కోసం జరిగిన చర్చలో వివరించారు. మరోవైపు మహిళల సాధికారత TDPతోనే ప్రారంభమైందని వివరించారు.
Similar News
News March 12, 2025
బోరుగడ్డ అనిల్‌పై హైకోర్టుకు రాజమహేంద్రవరం పోలీసుల లేఖ

AP: మధ్యంతర బెయిల్ గడువు మంగళవారంతో ముగిసినా బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోలేదని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు అధికారులు రాష్ట్ర హైకోర్టుకు సమాచారాన్ని అందించారు. ఈ మేరకు లేఖ రాశారు. రిమాండ్ ముద్దాయిగా ఉన్న అనిల్‌పై తగిన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. తన తల్లికి వైద్య చికిత్స కోసమని చెప్పి అనిల్ మధ్యంతర బెయిల్ తీసుకున్న సంగతి తెలిసిందే.
News March 12, 2025
ఎంగేజ్మెంట్ రింగ్‌ను సమంత ఏం చేశారంటే?

హీరోయిన్ సమంత తన నిశ్చితార్థపు ఉంగరపు డైమండ్‌ను లాకెట్‌గా మార్చుకున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. విడాకుల అనంతరం ఎంగేజ్మెంట్ రింగ్స్‌ను సరికొత్తగా మార్చుకోవడం ప్రస్తుతం ట్రెండ్‌గా మారిపోయిందని తెలిపాయి. లైఫ్‌లో ముందుకు సాగేందుకు ప్రముఖులు ఇదొక మార్గంగా ఎంచుకుంటున్నట్లు వెల్లడించాయి. తన వివాహ గౌన్‌ను కూడా బోల్డ్ బ్లాక్ బాడీకాన్‌గా మార్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై నెట్టింట చర్చ జరుగుతోంది.
News March 12, 2025
అర్ధరాత్రి దాటినా నిద్ర పట్టడం లేదా?

కొందరికి అర్ధరాత్రి 12 గంటలైనా నిద్ర పట్టదు. కానీ అంతసేపు నిద్రపోకుండా ఉండడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు 5 గంటలు ఫోన్ చూసేవారిలోనే ఈ సమస్య అధికంగా ఉంటుందని చెబుతున్నారు. రాత్రి తక్కువగా తినాలి. నిద్రకు 2 గంటల ముందే భోజనం తీసుకోవాలి. గది ఉష్ణోగ్రత 25 డిగ్రీలు ఉంచుకోవాలి. మ్యూజిక్ వినడం, బుక్స్ చదవాలి. నిద్రకు గంట ముందే ఫోన్‌ను దూరంగా పెట్టి పడుకుంటే నాణ్యమైన నిద్ర దొరుకుతుంది.