News November 8, 2024

నిస్సాన్‌లో 9,000 మందికి లేఆఫ్స్

image

జపాన్‌లో మూడో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ‘నిస్సాన్’ భారీగా లేఆఫ్స్‌కు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా 9,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇందులో యూరప్‌లోనే 4,700 జాబ్స్ ఉన్నట్లు వెల్లడించింది. అలాగే కార్ల ఉత్పత్తిని 20% తగ్గిస్తామని తెలిపింది. నిస్సాన్ వార్షికాదాయ అంచనాను 70 శాతం($975 మిలియన్) కుదించింది. తాము తీసుకునే చర్యలతో మళ్లీ పుంజుకుంటామని CEO మకోటో ఉచిద ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News November 8, 2024

OTTలోని వచ్చేసిన ‘వేట్టయన్’ మూవీ

image

రజినీకాంత్ నటించిన ‘వేట్టయన్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అక్టోబర్ 10న విడుదలై దాదాపు రూ.250 కోట్లు వసూలు చేసింది. అమితాబ్ బచ్చన్, మంజూ వారియర్, రానా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

News November 8, 2024

రేవంత్‌కు ప్రధాని మోదీ విషెస్

image

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యవంతమైన జీవితం లభించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. దీంతో ప్రధానికి సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. ‘ఇందిరమ్మ రాజ్యంతో ఇంటింటా వెలుగు నింపడానికి నిర్విరామ కృషి చేస్తున్న ప్రజా నాయకుడు రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు’ అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ట్వీట్ చేశారు.

News November 8, 2024

అనుచిత ప్రవర్తన.. జోసెఫ్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం

image

కెప్టెన్ హోప్‌పై ఆగ్రహంతో మ్యాచ్ మధ్యలో <<14549882>>గ్రౌండ్ వీడిన<<>> విండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు మండిపడింది. అతనిపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. తన ప్రవర్తనపై జోసెఫ్ విచారం వ్యక్తం చేశారు. కెప్టెన్‌కు, విండీస్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఇంగ్లండ్‌తో మూడో వన్డే నాలుగో ఓవర్‌లో ఫీల్డ్ ప్లేస్‌మెంట్‌ సరిగా లేదంటూ జోసెఫ్ గ్రౌండ్ నుంచి వెళ్లిపోవడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.