News November 26, 2024
కులగణన సర్వే 92.6 శాతం పూర్తి
TG: రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుల గణన సర్వే 1,08,89,758 ఇండ్లలో(92.6 శాతం) పూర్తి అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 13 జిల్లాల్లో 100శాతం, 17 జిల్లాల్లో 90 శాతంపైగా, మేడ్చల్ మల్కాజ్గిరిలో 82.3% పూర్తయినట్లు పేర్కొంది. మరోవైపు ఆన్లైన్లో డేటా నమోదు ప్రక్రియ కూడా ముమ్మరంగా సాగుతున్నట్లు తెలిపింది. ఎలాంటి పొరపాట్లు లేకుండా వివరాలు నమోదు చేయాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు.
Similar News
News November 26, 2024
ముంబై 26/11 మారణ హోమానికి 16 ఏళ్లు
దేశ ఆర్థిక రాజధానిలో మారణ హోమానికి 16 ఏళ్లు. 2008 నవంబర్ 26న సముద్రమార్గం ద్వారా ముంబైలోకి ప్రవేశించిన 10 మంది ఉగ్రవాదులు తాజ్ హోటల్, CSMT, ట్రైడెంట్ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లతో పాటు కాల్పులకు తెగబడ్డారు. 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 300 మంది గాయపడ్డారు. భద్రతా బలగాల కాల్పుల్లో 9 మంది దుండగులు చనిపోగా, ఉగ్రవాది కసబ్ సజీవంగా పట్టుబడ్డాడు. అతడిని 2012 నవంబర్ 21న ఉరితీశారు.
News November 26, 2024
RGV ఎక్కడ?
సోషల్ మీడియాలో పోస్టుల కేసులో RGV పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న ఆయనను విచారించేందుకు ఒంగోలు పోలీసులు HYD వచ్చారు. RGV ఇంట్లో లేరని సిబ్బంది వారిని అడ్డుకోవడంతో చాలాసేపు హైడ్రామా నడిచింది. వర్మ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు సమాచారం. అయితే ఆయన HYD లేదా కోయంబత్తూరులో ఉన్నారని అనుమానిస్తున్న పోలీసులు గాలింపు చేపట్టారు. అరెస్ట్ చేస్తారనే RGV పోలీసులకు చిక్కకుండా ఉన్నారని వార్తలొస్తున్నాయి.
News November 26, 2024
విశాఖ-ఖరగ్పూర్ మధ్య హైవేకు గ్రీన్సిగ్నల్
APలోని విశాఖ నుంచి ఖరగ్పూర్(బెంగాల్) మధ్య ఒడిశా మీదుగా 783KM మేర ఆరు లేన్ల గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. గతిశక్తి ప్రాజెక్టులో భాగంగా దీనికి DPR రూపొందించేందుకు NHAI టెండర్లు పిలిచింది. 2025 జూన్ నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నిర్మాణం పూర్తయితే విశాఖ నుంచి ఖరగ్పూర్కు 8 గంటల్లోనే చేరుకోవచ్చు. భావనపాడు, గోపాల్పూర్, కేంద్ర పారా పోర్టులను ఈ హైవే అనుసంధానిస్తుంది.